Jabardasth : మరోసారి జబర్దస్త్ స్థాయి ఏంటో నిరూపితం అయింది…!
Jabardasth : ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి దశాబ్ద కాలం పూర్తి కాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి తో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు కాబోతోతున్న నేపథ్యంలో నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పది సంవత్సరాల కాలంలో జబర్దస్త్ కి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి. వివిధ ఛానల్స్ లో జబర్దస్త్ రేటింగ్ తగ్గించేందుకు కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి, కానీ జబర్దస్త్ స్థాయిలో ఏ ఒక్క కార్యక్రమం కూడా సక్సెస్ కాలేక పోయింది. జబర్దస్త్ నుండి వెళ్లిన కమెడియన్స్ వేరే ఛానల్ లో కామెడీ షో
చేసినా కూడా జనాలు వాటిని పట్టించుకోవడం మానేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జబర్దస్త్ కంటే కూడా ఎక్కువ కామెడీ చేసే ప్రయత్నాలు చేసినా కూడా జనాల్లో జబర్దస్త్ అనేది నిలిచి పోయింది. అందుకే జబర్దస్త్ కార్యక్రమం నెంబర్ 1 గానే నిలిచి పోయింది. తాజాగా జబర్దస్త్ కి పోటీ గా ఓటిటి ప్లాట్ ఫామ్ పై కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ కార్యక్రమం వచ్చింది. ఆహా ఓటీటీ వారు ఈ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. కచ్చితంగా జబర్దస్త్ కార్యక్రమానికి ఇది పోటీ అన్నట్లుగా ఉంటుంది అని వారు భావించారు. కానీ ఈ కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కడం లేదట.
జబర్దస్త్ కార్యక్రమానికి పోటీ ఏమో కానీ కనీసం 10 వారాలు కొనసాగే అవకాశం ఈ కార్యక్రమానికి లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హేమాహేమీలు ఉన్నా కూడా డిజిటల్ ప్లాట్ఫారంపై మొదటి సారి కామెడీ షో అయినా కూడా జనాలు లైట్ తీసుకున్నారు. సుడిగాలి సుదీర్ అభిమానులు కూడా ఆయనను జబర్దస్త్ లో చూడాలి అనుకుంటున్నారు. కానీ ఇతర ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన చేస్తే పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కనుక జబర్దస్త్ కి పోటీ లేదు.. జబర్దస్త్ స్థాయి ఇది అంటూ దీంతో మరోసారి నిరూపితం అయింది.