Pavitra Lokesh : పవిత్ర లోకేష్ మొదటి భర్త ఇలాంటి వాడా బాబోయ్ .. టాప్ సీక్రెట్ లీక్ చేసింది !

Advertisement

Pavitra Lokesh : తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలు చేసి మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది పవిత్ర లోకేష్. చూడడానికి చాలా పద్ధతిగా, చక్కని రూపంతో కనిపించే ఈమె సీనియర్ నటుడు నరేష్, Senior actor Naresh తో సహజీవనం చేస్తుంది. దీంతో అంత పద్ధతిగా కనిపించే ఆమెపై నెగిటివిటీ పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో అయితే వీరిద్దరిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే నరేష్ కి ఇది నాలుగో పెళ్లి. అంతకుముందే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చేసి నాలుగో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోని కొందరు నెటిజన్లు

Pavitra Lokesh comments about her first husband
Pavitra Lokesh comments about her first husband

వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ఎందుకంటే పవిత్ర లోకేష్ మాట్లాడే తీరుపై వీళ్లిద్దరు ఎప్పటికీ పెళ్లి చేసుకోరు అని నమ్ముతున్నారు. గతంలో సీనియర్ నటుడు తన మూడవ భార్య రమ్య రఘుపతి గురించి చాలా గొప్పగా చెప్పడం విన్నాం. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా తన భార్యపై ఆరోపణలను చేస్తున్నారు. అలాగే గతంలో Pavitra Lokesh పవిత్ర లోకేష్ కూడా తన భర్త సుచేంద్ర ప్రసాద్ దేవుడు అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ తన భర్త సుచేంద్రప్రసాద్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement
Pavitra Lokesh comments about her first husband
Pavitra Lokesh comments about her first husband

ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ మేమిద్దరం కలిసి ముందుగా సీరియల్స్ లో నటించాం. అప్పుడే మా మధ్య పరిచయం ఏర్పదింది. అది కాస్త ప్రేమగా మారింది. మొదట మా మధ్య స్నేహం మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఇద్దరం ఒకటయ్యాం అంటూ చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్. అంతేకాదు నా భర్త సుచేంద్రప్రసాద్ చాలా గొప్ప వ్యక్తి అని, నాతో పోల్చుకుంటే ఆయన చాలా మంచివాడు అని తెలిపింది. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా నేను ఇప్పటివరకు చూడలేదు. నా అభిప్రాయాలను ఆయన ఏమాత్రం ఎదురు చెప్పకుండా గౌరవిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాల గురించి అస్సలు మాట్లాడుకోము అని తన మొదటి భర్త సుచేంద్రప్రసాద్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.

Advertisement
Advertisement