Pavitra Lokesh – Naresh : పవిత్ర లోకేష్ కి లిప్ కిస్ పెట్టి పెళ్లి కన్ఫామ్ చేసిన నరేష్… వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 31 December 2022, 12:35 pm

Pavitra Lokesh – Naresh : దాదాపు కొద్ది నెలల నుండి సోషల్ మీడియాలో సీనియర్ నటి పవిత్ర లోకేష్ మరియు నరేష్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అసభ్యంగా తమపై వార్తలు రాసిన వారిపై లీగల్ గా పవిత్ర మరియు లోకేష్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సమయంలో నరేష్ ప్రవర్తన చాలామందికి చిరాకు కలిగించింది.

ఇదే సమయంలో నరేష్ పక్కనే పవిత్ర లోకేష్ ఉండటం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరికి సంబంధించి రకరకాల వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే కొత్త సంవత్సరం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన నరేష్.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో కేక్ కట్ చేసి, పవిత్ర లోకేష్ కి  లిప్ కిస్ పెట్టారు. అంతేకాదు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.

Naresh confirmed the marriage with Pavitra Lokesh

Naresh confirmed the marriage with Pavitra Lokesh

ఇదే సమయంలో మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. దీంతో పవిత్ర లోకేష్ ఇంకా నరేష్ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలకు వాస్తవం రూపుదాల్చుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే నరేష్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అవ్వగా పవిత్రకు ఇది రెండో పెళ్లి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ నరేష్ లిప్ కిస్.. వీడియో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp