Pawan Kalyan : అసెంబ్లీ సమావేశాల తర్వాత హరిహర వీరమల్లు సెట్‌కి పవన్.. నాలుగు రోజుల్లో పూర్తి
ప్రధానాంశాలు:
Pawan Kalyan : అసెంబ్లీ సమావేశాల తర్వాత హరిహర వీరమల్లు సెట్‌కి పవన్.. నాలుగు రోజుల్లో పూర్తి
Pawan Kalyan : ఒకవైపు సినిమాలు,మరోవైపు రాజకీయాలతో పవన్ కళ్యాణ్ Pawan Kalyan బిజీ బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు` దర్శక-నిర్మాతలు జ్యోతికృష్ణ-రత్నంలు పవన్ తో సమాశమై ఎప్పటికప్పుడు మూవీ షూటింగ్ ఎలా నిర్వహించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. పవన్ కోసం ఏకంగా తాడేపల్లిలో సెట్ వేసినట్టు సమాచారం.

Pawan Kalyan : అసెంబ్లీ సమావేశాల తర్వాత హరిహర వీరమల్లు సెట్‌కి పవన్.. నాలుగు రోజుల్లో పూర్తి
శరవేగంగా..
తాడేపల్లిలో మూవీ షూటింగ్ మొదలైనట్టు తెలుస్తుండగా, ప్రస్తుతం సత్యరాజ్, ఈశ్వరీ రావులపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఈ సినిమా కోసం మరో 4 రోజులు కేటాయిస్తే ఆయన పార్ట్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తుంది. అసెంబ్లీ Assembly సమావేశాలు అయిపోయిన తరవాత పవన్ సెట్లో జాయిన్ అవుతారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక పవన్ ఓజీ oGచిత్రానికి డేట్లు ఇవ్వనున్నారు. ఈ సినిమా కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. పెండింగ్ కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని పవన్ అండ్ కో భావిస్తుంది. ఈ రెండింటి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. వీరమల్లుకు సంబం ధించి షూటింగ్ పూర్తయిన వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా సీజీకి సమయం కేటాయించకుండా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు