Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ తో వాళ్లకు రూ.5 కోట్ల నష్టం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ తో వాళ్లకు రూ.5 కోట్ల నష్టం

 Authored By aruna | The Telugu News | Updated on :11 September 2022,9:30 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా సినిమాలను మానేయాలని భావించాడు. కానీ తన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల సినిమాలు చేస్తేనే తనకు మేలని భావించి రాజకీయాలతో పాటు సినిమాలను కూడా చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాల్లో కొన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హరిహర వీరమల్లు షూటింగ్ దశలో ఉంది. మరో రెండు సినిమాలు ఇంకా పట్టాలెక్కలేదు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందాల్సిన పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.

ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. కానీ తాజాగా తన సమాచారం ప్రకారం సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేది డౌటే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభం కాకుండానే చిత్ర నిర్మాతలు అయిన మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అంత భారీ మొత్తాన్ని షూటింగ్‌ ప్రారంభం కి ముందే ఎందుకు ఖర్చు చేశారు.. ఎలా ఖర్చు చేశారంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేసిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు తల పట్టుకున్నారట.

pawan Kalyan and mythri movie makers combo movie update

pawan Kalyan and mythri movie makers combo movie update

షూటింగ్ మొదలైతే ఆ ఐదు కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు.. కానీ పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ లో ఉండి తమ సినిమాకు డేట్లు ఇవ్వడం లేదంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా పట్టుదలతో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఆయనకు భారీ పారితోషికాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా కు డేట్ లు ఇవ్వడం లేదు. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ మొత్తంలో అడ్వాన్సును ఇచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా చేయకుంటే ఆ అడ్వాన్సు ను తిరిగి వడ్డీ లేకుండా ఇచ్చేస్తాడు. కనుక మైత్రి మూవీ మేకర్స్ కి ఆ వడ్డీ కూడా పెద్ద నష్టమే.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది