Pawan Kalyan : అన్న పిలిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ రాకుండా ఉంటాడా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : అన్న పిలిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ రాకుండా ఉంటాడా!

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2022,7:30 pm

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మలయాళం లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ కి ఆ చిత్రం రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. అఫీషియల్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు మెగాస్టార్ రెడీ అయినట్లుగా సమాచారం అందుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు గాని ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే స్టేజ్ పై కలిసి కనిపించి చాలా నెలలు అయినట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

pawan kalyan for megastar chiranjeevi godfather movie pre release event

pawan kalyan for megastar chiranjeevi godfather movie pre release event

ఇద్దరు ఒకే స్టేజిపై కనిపించకపోవడంతో అభిమానులు ఒకింత అసహనంతో ఉన్నారు. దాంతో అభిమానుల కోసం అన్నట్లుగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై కలిసి కన్నుల విందు చేయబోతున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ కి ఇలాంటి వేడుకలు వేదికలు అంటే ఇష్టం ఉండదు. కానీ అన్నయ్య చిరంజీవి రమ్మంటే పవన్ తమ్ముడు రాకుండా ఉండలేడు. అందుకే గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ ఉంటాడు అని అభిమానులు నమ్ముతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది