Hari Hara Veera Mallu Business : పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే రికార్డ్ బిజినెస్.. లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రావాలి..?
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu Business : పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే రికార్డ్ బిజినెస్.. లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రావాలి..?
Hari Hara Veera Mallu Business : Hari Hara Veera Mallu Movie Review పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ Pawan Kalyan కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.రిలీజ్‌కు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

Hari Hara Veera Mallu Business : పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే రికార్డ్ బిజినెస్.. లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రావాలి..?
Hari Hara Veera Mallu Business : ఎంత రావాలి ?
హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు.ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు? ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడు? అంటూ పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హరిహర వీరమల్లు నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. దిల్‌రాజు, ఏషియన్ సునీల్, సూర్యదేవర నాగవంశీ వంటి బడా నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ వీరమల్లు నైజాం రైట్స్ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషం.
హరిహర వీరమల్లుకు నైజాంలో 37 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగ్గా.. సీడెడ్‌లో రూ.16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.9.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.7 కోట్లు, గుంటూరులో రూ.9.50 కోట్లు, కృష్ణాలో రూ.7.60 కోట్లు, నెల్లూరులో రూ.4.40 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 102 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది హరిహర వీరమల్లు.ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలలో రూ.12.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు చెప్పున వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకు రూ.126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా హరిహర వీరమల్లు నిలిచింది.చిత్రం తెలుగు రాష్ట్రాలలో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 103 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది