Pawan kalyan : గుంటూరు కారం సినిమాకి పెద్ద హెల్ప్ చేసిన పవన్ కళ్యాణ్ .. దండం పెట్టేసిన మహేష్ బాబు ..

Authored By aruna | The Telugu News | Published on: September 8, 2023, 8:00 pm

Pawan kalyan : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘ గుంటూరు కారం ‘. ఈ సినిమాని ప్రకటించి ఎన్నో రోజులు అవుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ బ్యూటీస్ శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుంటూరు కారం సినిమాకి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారని టాక్ బయటకు వచ్చింది. దీనికోసం భిన్నమైన చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మహేష్ బాబు శుభాకాంక్షలు తెలపడంతో ఇద్దరి స్టార్స్ సానిహిత్యానికి మధ్య ఒక చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ‘ జల్సా ‘ సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చాడో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుంటూరు కారం సినిమాకి అదే ఫేవర్ ను తిరిగి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. గుంటూరు కారం కథను పవన్ వాయిస్ తో చెప్పబోతున్నాడని టాక్. అయితే అలాంటిదేమీ లేదని కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు అంటుండగా, మరికొందరు మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ సన్నిహితుడు కావడంతో ఆయన కోరిక మేరకు ఈ ఆలోచన చేశారని, వాయిస్ ఓవర్ కోసం పవన్ కళ్యాణ్ తో మాట్లాడారని వెల్లడించారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అడిగితే ఇద్దరు స్టార్ హీరోలు ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఒప్పుకుంటారు అని అదే జరుగుతుంది అని అంటున్నారు.

Pawan kalyan help to Mahesh babu Guntur karam movie

Pawan kalyan help to Mahesh babu Guntur karam movie

అప్పట్లో వచ్చిన జల్సా మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అంతేకాదు ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు మరి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp