Pawan Kalyan : ఆలీ కూతురు పెళ్లి వేడుకకి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడానికి అసలు కారణం ఇదే..!
Pawan Kalyan : ప్రముఖ కమెడీయన్ ఆలీ కూతురి పెళ్లి, రిసెప్షన్ వేడుక ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం జగన్‌తో పాటు చిరంజీవి, నాగార్జున, రోజా తదితరులు వేడుకలో సందడి చేశారు. అయితే ఆలీకి బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ రెండు వేడుకలకి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వేడుకని కారణంగా చూపుతూ పవన్ కళ్యాణ్… అలీకి మధ్య దూరం ఇంకా తగ్గలేదా అని పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు. గతంలో అలీ కుటుంబంలో జరిగిన వేడుకలకు పవర్ స్టార్ హాజరై సందడి చేయగా, ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ..
అలీ కూతురి వివాహ వేడుకలో కనిపించకపోవడతో ఈ విషయం హట్ టాపిక్ అయింది. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య కొంత గ్యాప్ పెరిగిందనే ప్రచారం నడుస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీలో చేరడం, జనసేనకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం పవన్ కి అస్సలు నచ్చలేదు. ఫలితంగా పవన్ ఆలీపై బహిరంగంగానే ఘాటుగా మాట్లాడాల్సి వచ్చింది. ఇక పవన్ కామెంట్స్ కి తాను కూడా హర్ట్ అయ్యానని అలీ స్పందించడం కూడా మనం చూశాం . అయితే అలీ తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ను పిలవలేదని ఒక చర్చ నడుస్తుండగా, మరికొందరు మాత్రం అలీ అలా వ్యవహరించేంత సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదని అంటున్నారు.
రాజకీయ సమీకరణల వల్ల ఆలీ కుమార్తె పెళ్లిని పవన్ కళ్యాణ్ దాటవేశారని సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు చెబుతున్నా మరి కొందరు మాత్రం పొలిటికల్ విభేదాల కారణంగానే పవన్ కళ్యాణ్ అలీ కుమార్తె వివాహానికి హాజరు కాలేదు అని ప్రచారం చేస్తున్నారు. మరి రానున్న రోజులలో దీనిపై ఆలీ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. కాగా, అలీకి పవన్ కళ్యాణ్ పట్ల బలమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. . ఇటీవల ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే ఒక టాక్ షోలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఇంటర్వ్యూచేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్టు చెప్పిన విషయం విదితమే. అయితే ఆలీ ఇంట జరిగిన వివాహ వేడుకకి పవన్ రాకపోవడం కాస్త లోటుగా కనిపిస్తుంది.