Payal Rajput : హైపర్ ఆది ఎక్స్ ట్రాలు.. పరువుతీసిన పాయల్ రాజ్‌పుత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Payal Rajput : హైపర్ ఆది ఎక్స్ ట్రాలు.. పరువుతీసిన పాయల్ రాజ్‌పుత్

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,2:20 pm

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్‌కు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మీద ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాయల్ అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవుతుంటారు. ఆమె కోసం కుర్రకారు పడిచచ్చిపోతోంటారు. ఆమె మొదటి చిత్రంలోనే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్ఎక్స్ 100 అంటూ అందరినీ పలకరించింది. అందులో పాయల్ అందాల ప్రదర్శన చూసి టాలీవుడ్ జనాలు ముక్కున వేలేసుకున్నారు. అలాంటి పాయల్ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. ప్రస్తుతం పాయల్ చేతిలో ఫుల్ ప్రాజెక్టులున్నాయి. ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ సినిమాలో పాయల్ నటిస్తోంది.అయితే ఈ చిత్రం ఆగస్ట్ 19న రాబోతోండటంతో ప్రమోషన్స్ పెంచేశారు.

ఈ క్రమంలోనే పాయల్, ఆది సాయి కుమార్ ఇద్దరూ కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీకి వచ్చారు. ఇక ఇలాంటి అందమైన హీరోయిన్ గెస్టుగా వస్తే.. అక్కడి వారు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు కదా. అందులోనూ ఆది మరింత రెచ్చిపోతాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆది అనుకున్నంత పని చేశాడు. హీరోయిన్ ముద్దుల కోసం పాకులాడాడు. నరేష్ అంటే.. అందరూ చిన్న పిల్లాడిలానే చూస్తారు. 22 ఏళ్లు వచ్చినా కూడా నరేష్‌ను అంతగా పట్టించుకోరు. అయితే పాయల్‌ను ఫ్లర్ట్ చేసేందుకు నరేష్ ప్రయత్నిస్తాడు.

Payal Rajput Calls Hyper aadi As Brother

Payal Rajput Calls Hyper aadi As Brother

ఇక పాయల్ సైతం నరేష్ చెంపకు ముద్దు పెట్టినట్టు అలా ముద్దు పెట్టేసింది. దీంతో ఆది రెచ్చిపోయాడు. అలాంటిదే నాకు కూడా ఒకటి ఇవ్వు పనైపోద్దన్నట్టుగా ముందుకు వచ్చాడు హైపర్ ఆది. ఇక పాయల్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నరేష్ చెంపకు తన చెంప ఆనిచ్చినట్టు.. ఆది చెంపకు కూడా ఆనిచ్చింది. అయితే ఆ వెంటనే బ్రదర్ అనేసింది. దీంతో ఆది ఆవేశం, ఆశలు అన్నీ చల్లారిపోయినట్టున్నాయి. పాయల్‌కి కూడా ఎవరిని ఎలా అనాలో బాగానే తెలిసినట్టుంది.

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది