Payal rajput : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే.. ప్రైవేట్ ప్లేస్‌లో పాయల్ రాజ్‌పుత్ రచ్చ
Payal rajput : పాయల్ రాజ్‌పుత్‌కు ఓ బాయ్ ఫ్రెండ్ (సౌరభ్ ధింగ్రా) ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడికివెళ్లినా సరే అతను వెంటే ఉంటాడు. ఆయన తోడు లేకుండా పాయల్ రాజ్‌పుత్ ఎక్కడికి వెళ్లదేమో అనే అనుమానం కలిగేలా ప్రవర్తిస్తుంటుంది. ఈ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. షూటింగ్‌లకు ఎక్కడికి వెళ్లినా కూడా అతను వెంటే ఉంటాడు. ఈ మధ్యపాయల్ ముంబై హైద్రాబాద్‌లకు చక్కర్లు కొడుతూనే ఉంది. ఆమె వెంట ఈ బాయ్ ఫ్రెండ్ కూడా పరిగెడుతూనే ఉన్నాడు.
అయితే పాయల్ రాజ్‌పుత్ బాయ్ ఫ్రెండ్ బర్త్ డే నేడు. ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ తన బాయ్ ఫ్రెండ్‌ను తీసుకుని బయటకు వెళ్లింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ లోనవాలాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన బర్త్ డేను పాయల్ గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేస్తోన్నట్టుంది. అయితే ఈ క్రమంలో పాయల్ తన అందాలను భారీగా ప్రదర్శనకు పెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

Payal rajput on saurabh dhingra Birthday
Payal rajput : ప్రైవేట్ ప్లేస్‌లో పాయల్ రాజ్‌పుత్ రచ్చ
తాజాగా పాయల్ రాజ్‌పుత్ బికినీ ధరించినట్టుంది. అటు వైపుగా తిరిగి కూర్చుని స్విమ్మింగ్ పూల్‌లో కాళ్లు పెట్టి ఆడుకుంటోంది. వెనకవైపు నుంచి తన బాయ్ ఫ్రెండ్ ఆమెను కెమెరాలో బంధించాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ పిక్ క్రెడిట్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్‌కే ఇచ్చింది. ఈ ఫోటో తీసింది అతనే నా బర్త్ డే బాయ్ అంటూ తెగ మురిసిపోయింది. మొత్తానికి పాయల్ మాత్రం ఇలా ప్రైవేట్‌గా ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.