Nayanthara : అద్దె గర్భం విషయం లో నయనతారని అరస్ట్ చేయడానికి ఇంటికి వచ్చిన పోలీసులు .. అంతలోనే ఏం జరిగింది అంటే !
Nayanthara : నయనతార ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఆమె చేసే పనులు వివాదాలలో నిలుస్తుండడంతో విషయలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.పెళ్ళైన నాలుగు నెలల్లోనే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి సడెన్ షాకిచ్చింది నయనతార. నటుడు, దర్శకుడు విగ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లాడిన నయన్.. పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా పూర్తి కాకముందే మనకు కవల పిల్లలంటూ అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది.తమ జీవితంలోకి ఇద్దరు మగ కవల పిల్లలు వచ్చారని చెప్పి సర్‌ప్రైజ్ చేశారు విగ్నేష్ శివన్.
అంతేకాదు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుతూ తన పిల్లలను భార్య నయన్ ముద్దాడుతున్న పిక్స్ షేర్ చేశారు.భారతీయ చట్టం ప్రకారం సరోగసీ విధానంలో బిడ్డకు జన్మనివ్వాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అయితే ఆ రూల్స్ అన్నింటినీ నయన్ దంపతులు ఫాలో అయ్యారా? లేదా అనేది హాట్ ఇష్యూ అయింది.ఇది చట్ట విరుద్ధం అనే పాయింట్ ని చాలామంది లేవనెత్తడంతో రచ్చ షురూ అయింది. ఇంతలో ఈ ఇష్యూపై తమిళనాడు ప్రభుత్వం రియాక్ట్ అవుతూ.. నయన్ దంపతుల నుంచి విచారణ కోరింది. నయన్ కవల పిల్లల విషయమై తగు విచారణ చేస్తామని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం చెప్పారు.
Nayanthara : వారు సేఫ్ జోన్‌లో పడ్డారా..
అయితే తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లుగా ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదేవిధంగా గత డిసెంబరులో అద్దెగర్భం కోసం రిజిస్టర్ చేసుకుని ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను విచారణ కమిటీకి వారు సమర్పించినట్టు తెలిసింది. దీంతో వారు సేఫ్ అయినట్టు తెలుస్తుంది. రూల్స్ ప్రకారం సంతానోత్పత్తికి సంబంధించిన కణాలను దానం చేసిన మహిళకు 21 నుంచి 36 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలని, ఆమె కచ్చితంగా వివాహిత అయి ఉండాలని, అంతేకాకుండా ఆమె తన భర్త అనుమతి తీసుకోవాలని వంటి నిబంధనలు పాటించారా అనే విషయాలపై విచారణ చేయాలని కోరింది సర్కారు.