Pooja Hegde : పూజా హెగ్డే చిన్నప్పుడే ఆ స్టార్ హీరో హర్ట్ చేశాడట..!
Pooja Hegde : మొన్నటి దాకా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన పూజా హెగ్డే ప్రస్తుతం బ్యాడ్ ఫేస్ లో ఉంది. పూజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో అమ్మడి తదుపరి సినిమాలపై ఆసక్తి నెలకొని ఉంది. ప్రభాస్‌తో కలిసి నటించిన `రాధేశ్యామ్` చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పరాజయం చెందింది. చాలా నష్టాలను చవిచూసింది. విజయ్‌తో కలిసి `బీస్ట్` చిత్రంలో నటించింది పూజా. ఈ సినిమా తమిళనాట వంద కోట్ల వరకు వసూలు చేసింది. కానీ ఓవరాల్‌గా ఫ్లాప్ జాబితాలో చేరింది. మరోవైపు ఇటీవల రామ్‌చరణ్‌తో చేసిన `ఆచార్య` కూడా డిజాస్టర్ టాక్‌ని తెచ్చుకుంది.సినిమా పరాజయంలో హీరోయిన్ పాత్ర ఏమీ ఉండదనేది అందరికి తెలిసిన నిజమే.
దర్శకుడి టేకింగ్, బలమైన కథ ఆధారంగానే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు మాత్రమే నటీనటుల ప్రభావం ఉంటుంది. సినిమాని నటులు తమ నటనతో మరో స్థాయికి తీసుకెళ్తారు. కానీ తక్కువ చేయరు. రేర్ కేసులోనే మిస్ ఫిట్ అనే టాక్ వస్తుంది. ఏదేమైనా పూజాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందంటున్నారు నెటిజన్లు. అయితే తన హార్ట్ మాత్రం 12ఏళ్లప్పుడే బ్రేక్ అయ్యిందంటోంది పూజా హెగ్దే. ఓస్టార్ హీరో తన హృదయాన్ని ముక్కలు చేశాడని తెలిపింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. హృతిక్ రోషన్ అంటే చిన్నప్పటి నుండి పూజాకి పిచ్చి అట, ఎంతో అభిమానించినట్టు చెప్పింది. ఆయన అందానికి ఫిదా అయ్యిందట. ఒక్కసారైనా హృతిక్‌ని కలవాలని తపించిందట.
Pooja Hegde : అలా కోరిక తీర్చుకుంది..
`కోయీ మిల్ గయా` సినిమా టైమ్‌లో ఆయన్ని కలిసేందుకు వెళ్లిందట. ఆ సినిమా ప్రీమియర్ టైమ్‌లో హృతిక్‌ని కావాలని వెళ్లిన పూజా ఎలాగైనా ఆయన్ని కలిసి ఒక ఫోటో దిగాలని తపించిందట. వరుసగా ఆయనతో ఫోటోలు దిగుతున్నారని, తాను కూడా ఫోటోలు దిగాలని స్టేజ్ ఎక్కిందట. కానీ అప్పటికే ఆయన మరోవైపు నుంచి స్టేజ్ దిగి వెళ్లిపోయారని, దీంతో ఒక్కసారిగా తన హృదయం ముక్కలైందని చెప్పిందీ డస్కీ భామ. అలా స్టార్ హీరో తన హృదయాన్ని బ్రేక్ చేశాడని చెప్పింది.చిన్నప్పుడు తీరని కోరికని హీరోయిన్ అయ్యాక తీర్చుకుంది పూజా హెగ్దే. అభిమానిగా ఫోటో దిగడానికి కుదరలేని పరిస్థితి నుంచి, ఏకంగా ఆయన పక్కనే స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి పూజా ఎదిగిన తీరు ఆదర్శనీయం. వీరిద్దరు కలిసి `మొహెంజోదారో` చిత్రంలో నటించారు. అయితే ఈ చిత్రం పరాజయం చెందడం గమనార్హం.