Pooja Hegde : హీరోయిన్‌ను సాధారణంగా పిలవరు!.. పూజా హెగ్డే సంచలన కామెంట్స్ వైరల్
Pooja Hegde : సినీ ఇండస్ట్రీలో హీరో ఆధిప్యతమే ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లకు ఎంత డిమాండ్ ఉన్న, ఎంత పేరు వచ్చినా కూడా హీరోలతో సరిసమానమైన గౌరవం, క్రేజ్ మాత్రం ఉండవు. రావు. అలా ఏదైనా సినిమా ఈవెంట్‌కు హీరోలను ముఖ్య అతిథిగా పిలుస్తారు. కానీ హీరోయిన్‌ను మాత్రం ఎప్పుడూ పిలవరు. కానీ తాజాగా వరుడు కావలెను అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిర్మాతలు పూజా హెగ్డేను పిలిచారు. దానిపై బుట్టబొమ్మ స్పందించింది.

pooja-hegde-on-varudu-kaavalenu-event
హీరోయిన్‌ను ఇలాంటి ఈవెంట్లకు ముఖ్య అథితిగా సాధారణంగా పిలవరు.. అది అరుదుగా జరుగుతుందని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. నన్ను అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. ఆ క్రెడిట్ చిన్నబాబు, వంశీలకు దక్కుతుందని తెలిపింది. హారికా అండ్ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్ అని గర్వంగా చెప్పుకుంది. చినబాబుగారు నన్ను ఇంట్లో మనిషిలా చూస్తారు అని నిర్మాత గురించి ఎంతో గొప్పగా చెప్పేసింది.
Pooja Hegde వరుడు కావలెను ఈవెంట్‌లో పూజా హెగ్డే

pooja-hegde-on-varudu-kaavalenu-event
కరోనా వల్ల ఎంతో బాధపడ్డాం. కాస్త రిలాక్స్ అవ్వడం కోసం థియేటర్‌లోనే సినిమా చూడండి అని ప్రేక్షకులను వేడుకుంది. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ ఉంటారు. ‘వరుడు కావలెను’ మహిళా దర్శకురాలు తెరకెక్కించిన మంచి ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్టై టీమ్‌కు మంచి పేరుతోపాటు నిర్మాతలకు లాభాలు రావాలి. ఇదే జోష్‌తో సక్సెస్ పార్టీలో కలుద్దాం అని చెప్పుకొచ్చింది.