Akhil : అఖిల్ తో పూజా హెగ్డే రొమాన్స్..నెవెర్ బిఫోర్ అంటున్నారు..!
Akhil : అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీఏ2 బ్యానర్ పై బన్ని వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అఖిల్ కి జంటగా నటిస్తోంది. ఇప్పటి వరకు అఖిల్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. కాని ఏ ఒక్కటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అఖిల్ కి హీరోగా మంచి పేరే వస్తోంది. కాని భారీ హిట్ మాత్రం దక్కడం లేదు. కాగా అఖిల్ కెరీర్ లో నాలుగవ సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వస్తోంది.

Pooja hegde romance with akhil is never before
రొమాంటిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించాడట బొమ్మరిల్లు భాస్కర్. ముఖ్యంగా అఖిల్ – పూజా హెగ్డేల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటాయని .. ఈ సీన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయని చెప్పుకుంటున్నారు. ఇక ముందు నుంచి అఖిల్ కి హీరోయిన్ సెట్ కాదన్న టాక్ ఉంది. కాని మోస్ట్ ఎలిజిబుల్ సినిమాలో మాత్రం పూజా హెగ్డే .. అఖిల్ కి పర్‌ఫెక్ట్ పేయిర్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తుంటే కూడా ఈ విషయం అర్థమవుతోంది. గ్లింప్స్.. టీజర్ చూస్తే ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అర్థమైంది.
Akhil : అఖిల్ కి గ్యారెంటీగా సూపర్ హిట్ ని ఇస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
కాగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘గుచ్చే గులాబి’ అన్న రొమాంటిక్ లిరికల్ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ లో అఖిల్ – పూజా హెగ్డేల లుక్స్ చాలా బావున్నాయి. ఇప్పటి వరకు అఖిల్ సినిమాలో లేని రొమాంటిక్ సీన్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అఖిల్ కి గ్యారెంటీగా సూపర్ హిట్ ని ఇస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. కాగా అఖిల్ నెక్స్ట్ సినిమాని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తునారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది.