Poorna : పరువుతీసిన పూర్ణ.. సెట్‌లో ఉండలేకపోయిన ఇమాన్యుయేల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poorna : పరువుతీసిన పూర్ణ.. సెట్‌లో ఉండలేకపోయిన ఇమాన్యుయేల్

 Authored By prabhas | The Telugu News | Updated on :6 June 2022,4:30 pm

Poorna : బుల్లితెరపై ఇమాన్యుయేల్ చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక పూర్ణ సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. వచ్చీ రానీ తెలుగుతో ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంది. తనకు వచ్చిన స్టెప్పులు వేస్తూ మ్యానేజ్ చేస్తుంది.అలా ఢీ షోలో కొన్ని రోజులు హల్చల్ చేసింది. అక్కడ కంటెస్టెంట్లు, డ్యాన్స్ మాస్టర్ల బుగ్గలు కొరికి తెగ హడావిడి చేసింది. అయితే ఇప్పుడు పూర్ణ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు వచ్చింది. ఇంద్రజ స్థానంలో పూర్ణ వచ్చింది. అయితే పూర్ణ ఎంట్రీ రాగానే.. శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులంతా కూడా నా బుగ్గ కొరకండి అంటూ వెంటపడ్డారు. అదీ తన రేంజ్ అని పూర్ణ గుర్తించలేకపోయింది. పూర్ణ పరువు అందరూ కలిసి తీసేశారు.

అది పక్కన పెడితే.. ఓ స్కిట్లో ఇమాన్యుయేల్‌ను దారుణంగా అవమానించింది పూర్ణ. ఇమాన్యుయేల్ దగ్గరకు వచ్చి కూర్చుంటే.. స్నానం చేయలేదా?.. అని ముక్కు మూసుకుంటుంది. ఇందాక వాళ్లంతా కూడా ఉన్నా ఇలాంటి వాసన రాలేదు.. నువ్ వచ్చాకే వస్తోంది అంటూ ముక్కు మూసుకుని ఇమాన్యుయేల్ పరువుతీసింది పూర్ణ. దీంతో సెట్‌లో అందరూ కూడా అలానే చేశారు. ఇక ఏం టీం వద్దకు వెళ్లి కూర్చున్నా కూడా అలానే దూరం దూరంటూ పెట్టేశారు. దీంతో ఇమాన్యుయేల్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన టీం సభ్యులు కూడా తనను అసహ్యించుకున్నట్టుగా చేస్తారు. అవతలి టీంలో అయితే పవిత్ర, రోహిణిలు దారుణంగా కించపరుస్తుంటారు.

Poorna Satires On Emmanuel Smell In Sridevi Drama Company

Poorna Satires On Emmanuel Smell In Sridevi Drama Company

ఇక వర్ష అయితే వాంతులు చేసుకున్నట్టుగా యాక్షన్ చేస్తుంది. నువ్ మరీ అంత ఓవర్ చేయొద్దు.. నిన్నేదో చేశానని వాళ్లనుకుంటారు అని ఇమాన్యుయేల్ కౌంటర్ వేస్తాడు. దీంతొ వర్ష తెల్లమొహం వేస్తుంది. ఇక ఇలా లాభం లేదని ఇమాన్యుయేల్.. స్టూడెంట్‌ల మధ్యలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ స్టూడెంట్స్ సైతం అలానే లేచిపోతుంటారు. దీంతో ఇమాన్యుయేల్ మండిపడతాడు. ఇదంతా మీ వల్లే వచ్చిందంటూ పూర్ణ మీద కోపంతో ఊగిపోతాడు ఇమాన్యుయేల్. అలా మొత్తానికి పూర్ణ కామెడీగా అందో నిజంగానే అందో గానీ ఇమాన్యుయేల్‌కు మాత్రం అందరూ చుక్కలు చూపించారు.

YouTube video

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి