Adipurush : రాధే శ్యామ్ తో డీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ కి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిన ఆదిపురుష్ టీజర్ !
Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో సీత గా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలి ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ టీజర్ తో ఆ అంచనాలను రెట్టింపు చేశాడు డైరక్టర్ ఓం రౌత్. ముఖ్యంగా రాముడిగా ప్రభాస్ ఆహార్యం.. స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని అర్ధమవుతుంది. జస్ట్ టీజర్ తోనే సినిమా గురించి సూపర్ ఎక్సయిట్ అయ్యేలా చేశాడు ఓం రౌత్. సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సీజీ వర్క్ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది.

prabhas adipurush teaser fans full happy
రాధే శ్యామ్ సినిమా తో నిరాశపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాతో తప్పకుండా కాలర్ ఎగురవేస్తారని చెప్పొచ్చు. రాముడి పాత్రలో ప్రభాస్ అభినయం అందరిని మెప్పిస్తుందని అంటున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బాహుబలి తర్వాత ఆ అంచనాలను అందుకోని ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తాడని అర్ధమవుతుంది.
ప్రభాస్, ఓం రౌత్ కలిసి చేసిన ఈ అద్భుత కళాకండం ఆదిపురుష్ ఇండియన్ సినీ లవర్స్ కి ఓ మంచి అనుభూతిని ఇచ్చే సినిమా అవుతుందని చెప్పొచ్చు. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే అసలు బొమ్మ థియేటర్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఆదిపురుష్ టీజర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన రాధే శ్యాం సినిమా ఫ్లాప్ అవగా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నీరసపడ్డారు. అయితే ఆదిపురుష్ మాత్రం అంచనాలకు మించి ఉండేలా ఉందని తెలుస్తుంది. సినిమా గ్రాండియర్ చూస్తేనే వారెవా అనిపించేలా ఉంది. తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆదిపురుష్ ఓ మర్చిపోలేని గిఫ్ట్ అవుతుందని చెప్పొచ్చు.
