Home » Entertainment » Prabhas Fans Are Afraid Of Movie With Nag Ashwin
Entertainment

Nag ashwin : నాగ్ అశ్విన్ తో సినిమా అంటే భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..?

Authored By
vamana sai
The Telugu News | Published on: February 20, 2021, 3:17 pm
Advertisement

Nag ashwin : నాగ్ అశ్విన్ దర్శకత్వలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ సినిమాని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అందుకు కారణం ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మించే 50 వ సినిమా కావడమే. అందుకే నిర్మాత అశ్వనీదత్ ఖర్చు కి వెనకాడకుండా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు గారు క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

prabhas fans are afraid of movie with nag ashwin

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రానుందని ప్రచారం జరుగుతోంది. మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ దేశ వ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకున్నాడు. దాంతో ప్రభాస్ తో సినిమా అనగానే అందరిలో భారీ ఆసక్తి నెలకొంది. కాని తాజాగా రిలీజైన పిట్ట కథలు అన్న తెలుగు వెబ్ సిరీస్ తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు తారుమారయ్యాయని చెప్పుకుంటున్నారు.

Advertisement

Nag ashwin : ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా ఎలా తీయగలడు..?

రీసెంట్ గా తెలుగు లస్ట్ స్టోరీస్ అంటూ నాలుగు ఎపిసోడ్స్ గా పిట్ట కథలు అన్న వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా టెలికాస్ట్ అవుతున్న పిట్టకథలు లో ‘ఎక్స్-లైఫ్’ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అయితే ‘ఎక్స్-లైఫ్’ కి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైందని అంటున్నారు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ని డీల్ చేయలేకపోయాడు.. అలాంటిది ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా ఎలా తీయగలడు అంటూ మాట్లాడుకుంటున్నారట. మరి నాగ్ అశ్విన్ సినిమా ని నిజంగా ఎలా తీసాడో చూడాలి. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ .. ఆదిపురుష్ సినిమాలని చేస్తున్నాడు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి