Prabhas : పెద్ద‌నాన్న కోసం 12 ఏళ్ల‌లో తొలిసారి అక్క‌డికి వెళుతున్న ప్ర‌భాస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : పెద్ద‌నాన్న కోసం 12 ఏళ్ల‌లో తొలిసారి అక్క‌డికి వెళుతున్న ప్ర‌భాస్..!

Prabhas : రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవ‌ల హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతితో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద చాయ‌లు అలుముకున్నాయి. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కృష్ణంరాజు. ఇటీవల కొంత అస్వస్థకు గురి కావడంతో కృష్ణంరాజు గారిని హాస్పిటల్ కు తరలించారు, ఎప్పటిలాగానే తిరిగి వస్తారు అనుకున్న రెబల్ స్టార్ ఇక లేరు అన్న వార్తను విని.. యావత్తు సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది . ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 September 2022,11:00 am

Prabhas : రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవ‌ల హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతితో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద చాయ‌లు అలుముకున్నాయి. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కృష్ణంరాజు. ఇటీవల కొంత అస్వస్థకు గురి కావడంతో కృష్ణంరాజు గారిని హాస్పిటల్ కు తరలించారు, ఎప్పటిలాగానే తిరిగి వస్తారు అనుకున్న రెబల్ స్టార్ ఇక లేరు అన్న వార్తను విని.. యావత్తు సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది . ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోగా ఎదగడానికి అవసరమైన ఫ్లాట్ ఫామ్ సెట్ చేసింది కృష్ణం రాజే. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ పెద్ద దిక్కు కోల్పోయినట్లు అయింది. ఆయ‌న లేర‌నే విష‌యాన్ని ప్ర‌భాస్ అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Prabhas : చాలా రోజుల త‌ర్వాత‌..

అయితే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి తన పెదనాన్నకి జరపాల్సిన కార్యక్రమాలపై ద్రుష్టి పెట్టాడట. దీని కోసం ప్రభాస్ 12 ఏళ్ల తర్వాత తొలిసారి మొగల్తూరులో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 28న ప్రభాస్ మొగల్తూరు రానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ప్రభాస్ అక్కడే ఉండి కృష్ణం రాజు సంస్కరణ సభ, సమారాధన జరిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ మొత్తం మొగల్తూరు వెళ్లనుంది. 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు దిన కార్యక్రమాల కోసం ప్రభాస్ మొగల్తూరు వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళి ఇప్పుడు తన పెదనాన్న కోసం వెళుతున్నాడు.

Prabhas Going To Mogalturu After 12 Years Behalf Of Krishnam Raju Death

Prabhas Going To Mogalturu After 12 Years Behalf Of Krishnam Raju Death

ఇక ఇటీవ‌ల హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన ‘కృష్ణంరాజు సంస్మరణ సభ’కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. “మంచికి మారు పేరు, ప్రేమానురాగాలతో పలకరించే కృష్ణంరాజు గారు చనిపోవడం చాలా దురదుష్టకరం. తన విభిన్నమైన నటనా ప్రదర్శనతో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత గొప్ప నటుడు అనిపించుకున్న కృష్ణం రాజుగారుకి గౌరవంగా ఫిల్మ్ నగర్ లో ఒక విగ్రహం ఏర్పాటు చేస్తాం” అంటూ సభాముఖంగా వెల్లడించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది