Prabhas : ప్రభాస్, అనుష్క శెట్టి జంటగా కొత్త చిత్రం.. ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమాపై అభిమానులలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటున్నాయి. అందులో హీరోయిన్ ఎవరు, చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ చిత్రంతో అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. తదుపరిగా ప్రభాస్ ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే మరో సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఇక వీటితో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలోనూ మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.
ఇక అనుష్క విషయానికి వస్తే టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్ల లిస్ట్ లో అనుష్క పేరు తప్పకుండా ఉంటుంది. స్టార్ హీరోలపక్కన్న అంతే ఇమేజ్ తో మెరుపులు మెరిపించాలన్నా.. విమెన్ ఓరియెంటెడ్ సినిమాలతో రచ్చ చేయాలన్నా.. అనుష్క తరువాతే ఎవరైనా. అంతగా టాలీవుడ్ లో తన ముద్ర వేసింది స్వీటి. అనుష్క చేసిన అరుంధతి రుద్రమదేవి, భాగమతి సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా కలెక్షన్స్ ను రాబట్టాయి. స్టార్ హీరోలకు సమానంగా అనుష్క ఇమేజ్ ను పెంచాయి. ఇక ఒక హీరోతో అనుష్కను చూడాలి అంటే ఆడియన్స్ అనుష్క పక్కన చూడాలి అనుకునేది ప్రభాస్ నే. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై అంతలా వర్కౌట్ అవుతుంది.

prabhas pairs with Anushka Shetty
Prabhas : ఈ కాంబినేషన్‌కి పిచ్చెక్కిపోవల్సిందే..!
ప్రభాస్-అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాలు గా నిలిచాయి. మిర్చి, బాహుబలి సనిమాలు అయితే ఫ్యాన్స్ చేత కేరింతలు పెట్టించాయి. ఒక క్రమంలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అన్నటాక్ కూడా గట్టగా నడిచింది. ఫారెన్ లో ఇల్లు కూడా కట్టుకున్నారు అని ఇండస్ట్రీ గుసగుసలాడింది అప్పట్లో. అయితే ప్రభాస్ మారుతి సినిమాలో అనుష్క మెయిన్ లీడ్‌గా కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ మూవీ కోసం రూ. 5కోట్ల ఖర్చుతో ప్రభాస్ ఇంటి సెట్ ను కూడా నిర్మి్స్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు పెళ్ళిసందడి ఫేమ్ శ్రీలీల కాగా.. మరో హీరోయిన్ గా మాళవికా మోహనన్ ను ఎంపిక చేశారట.