Prabhas : ప్ర‌భాస్ ఫోన్ కాల్ లీక్.. ఆ హీరోయిన్‌తో ఏం మాట్లాడారో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్ర‌భాస్ ఫోన్ కాల్ లీక్.. ఆ హీరోయిన్‌తో ఏం మాట్లాడారో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :2 September 2022,6:30 pm

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఇటీవ‌లి కాలంలో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. క్ష‌ణం తీరిక లేకుండా ప్ర‌భాస్ సినిమాలు చేస్తుండ‌గా, ఆయ‌న సినిమాలు ఎప్పుడు విడుద‌ల అవుతాయా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అభిమానులు హంగామా చేస్తుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో చేసే ట్రెండ్‌లకు నిర్మాణ సంస్థలు బెదిరిపోతోంటాయి. ఆ మధ్య రాధే శ్యామ్ విషయంలో యూవీ క్రియేషన్స్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ ఏకిపారేశారు. అయితే తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆయ‌న ఫోన్ కాల్‌ని నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Prabhas : కృతి ఫోన్ ..

కాఫీ విత్ కరణ్ సక్సెస్ ఫుల్ గా ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుని ప్రజెంట్ ఏడవ సీజన్ ని జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. దీనికి కరణ్ హోస్ట్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ షోకి బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌రు అవుతుండ‌గా, వారికి విచిత్ర ప్ర‌శ్న‌లు ఎదురవుతున్నాయి. రీసెంట్ గా ఈ కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్‌గా వ‌చ్చారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరో టైగర్ ష్రాఫ్. ఇందులో ఓ రౌండ్ ఉంటుంది. ఎవరైనా ఒక సెలెబ్రిటీకి ఫోన్ చేసి.. హే కరణ్ ఇట్స్ మీ అని చెప్పించాలనే రౌండ్ ఉంటుంది. ఈ రౌండ్‌లో భాగంగా కృతి సనన్.. ప్రభాస్‌కు ఫోన్ చేసింది. ప్రభాస్‌తో కృతి సనన్ మాట్లాడిన ఆడియో కాల్, ప్రభాస్ సిగ్గు పడిన విధానం, మొహమాట పడుతూ చెప్పిన మాటలు వింటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Prabhas Phone Call Leak With Kriti Sanon

Prabhas Phone Call Leak With Kriti Sanon

హాయ్ ప్రభాస్.. నేను కరణ్ షోలో ఉన్నాను అని అంటుంది కృతి. హాయ్ కృతి అంటూ నవ్వుతూ డార్లింగ్ పలకరిస్తాడు. ఇక వెంటనే కరణ్ జోహర్ వచ్చి.. హేయ్ ప్రభాస్.. నేను కరణ్ జోహర్ అని అంటాడు. హేయ్ కరణ్.. ఇట్స్ మీ అని చెప్పు అంటాడు. ఇక మన డార్లింగ్ ప్రభాస్ మొహమాటపడుతూ.. హేయ్ కరణ్ ఇట్స్ మీ ప్రభాస్ అని అంటాడు. వన్ అండ్ ఓన్లీ బాహుబలి ప్రభాస్.. కృతి సనన్‌కు రెండు పాయింట్లు సంపాదించి పెట్టాడు అని కరణ్ అంటాడు. ఇక తరువాత కృతి మాట్లాడుతూ.. ప్రభాస్ నీకు మళ్లీ నేను చేస్తాను అని అంటుంది. మరో వైపు టైగర్ ష్రాఫ్ మాత్రం.. తాను చేసిన సెలెబ్రిటీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తెల్లమొహం వేసుకుని చూస్తుంటాడు. మొత్తానికి ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

 

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది