Krithi Shetty : అన్నీ కుదిరితే ఉగాదికేనట!.. కృతి శెట్టి మీద కన్నేసిన ప్రదీప్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krithi Shetty : అన్నీ కుదిరితే ఉగాదికేనట!.. కృతి శెట్టి మీద కన్నేసిన ప్రదీప్

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2022,7:30 pm

Krithi Shetty : సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధం అయ్యాయి. ఒక ఛానల్ ని మించి మరొక ఛానల్ ప్రత్యేక ఈవెంట్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి మల్లెమాల ముందు వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర నటీనటులు జబర్దస్త్ కమెడియన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి బంగార్రాజు హీరోయిన్ కృతి శెట్టి హాజరైనట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి బేబమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ప్రోమోలో ప్రతి ఒక్కరు తమ దైన శైలిలో ఆటపాటలతో అద్భుతమైన పంచ్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.యాంకర్ ప్రదీప్ గురించి మనందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన

Pradeep comments on krithi shetty in ammamma gari ooru show

Pradeep comments on krithi shetty in ammamma gari ooru show

Krithi Shetty : మరోసారి ప్రదీప్ పెళ్లి ప్రస్తావన…

ప్రదీప్ కు ఈ వేదికపై కూడా తన పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇప్పటివరకు ప్రదీప్ కి పెళ్లి కాకపోవడంతో తరుచూ ఈయన పెళ్లి గురించి సెటైర్లు వేయడం సర్వసాధారణం. ఇక ఈ ప్రోమోలో భాగంగా హీరోయిన్ కృతి శెట్టితో వేదికపై ఉన్న ప్రదీప్ మేడం వచ్చే సంక్రాంతి కైనా (తన పెళ్లి గురించి) అంటూ అన్నారు కదా.. అన్నీ కుదిరితే ఉగాదికే అంటూ హీరోయిన్ కృతి శెట్టి వైపు కొంటె చూపులు చూస్తూ కృతి శెట్టితో పులిహోర కలపడానికి ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది