Pragathi : సోదరి పెళ్లి వేడుకల్లో ప్రగతి హంగామా.. దానిపై ఎక్కి మరి డాన్స్ చేస్తుంది భయ్య.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 3, 2022, 8:00 pm

Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ప్రగతి ఒకరు. తనదైన రీతిలో సినిమాలలో నటిస్తూ చేతికి అందిన పాత్రలను చేజారనివ్వకుండా అన్ని పత్రాలు చేస్తూ వస్తుంది. అయితే ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చిన ప్రగతికి కొన్ని చేదు అనుభవాలు ఎదురవడం వలన క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైంది. హీరోయిన్ గా రానించలేకపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ ను అందుకుంది సినిమాలలో హీరో హీరోయిన్ ల తల్లి పాత్రలో, పక్కింటి ఆంటీ పాత్రలో నటిస్తూ ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. అయితే తాను సోషల్ మీడియాలో ,తన పర్సనల్ విషయాలను ,షేర్ చేసుకోవడం మొదలుపెట్టిన కొత్తలో చాలా ట్రోలింగ్ కు గురైంది. అయినా కూడా ఆమె వెనకడుగు వేయకుండా అలానే చేస్తూ ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచింది. ఎంతో కష్టపడి పైకి వచ్చిన ప్రగతి మొదటి అడుగు ఎప్పుడు కష్టంగానే ఉంటుందని ఆ ఒక్కటి దాటగలిగితే ఇక నిన్ను ఎవరు ఆపలేరని నేను అయితే ఇదే నమ్ముతాను అంటూ చెబుతుంది.

Pragathi dance video viral in youtube

Pragathi dance video viral in youtube

అయితే రీసెంట్ గా తన సిస్టర్ హల్దీ ఫంక్షన్ లో ప్రగతి చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తన సోదరి పసుపు ఫంక్షన్ లో డోలు వాయిస్తూ డాన్స్ చేస్తూ ప్రగతి రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా డోలు పై కూర్చుని మరి డాన్స్ చేస్తూ రచ్చ చేసింది దీంతో ప్రగతి డాన్స్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ వయసులో కూడా ఆమె డాన్స్ ఈ రేంజ్ లో చేయడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది వయసుకు తగ్గ పనులు చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

https://youtu.be/FItKdB6LuF8

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp