pragna jaiswal : ప్రగ్యా జైస్వాల్ కి బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ తో వాళ్ళంతా కుళ్ళుకుంటున్నారు ..!

Advertisement

pragna jaiswal: ప్రగ్యా జైస్వాల్ కి టాలీవుడ్ లో కంచె సినిమాతో విపరీతమైన పేరొచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ మేకర్స్ అందరి దృష్ఠిని తనవైపు తిప్పుకుంది. అయితే ఒకే ఒక్క విషయంలో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడం లో బాగా వెనకబడిపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె సినిమాలో హుందాగా కనిపించిన ప్రగ్యా ని హాట్ హీరోయిన్ గా ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న సందేహం చాలామందిలో కలిగింది. ఇదే ప్రగ్యా కి ఆ తర్వాత కొంత వరకు మైనస్ గా మారింది.

pragya jaiswal got an awesome offer from bollywood
pragya jaiswal got an awesome offer from bollywood

అప్పటికీ జయ జానకి నాయక.. ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి కొన్ని సినిమాలలో బాగా హాట్ గానే కనిపించింది. కానీ ఆ సినిమాలేవీ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ కి ఉపయోగపడకపోగా మైనస్ గానూ మారాయి. దాంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న బిబి 3 లో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. చెప్పాలంటే ఇది ప్రగ్యా కి చాలా మంచి అవకాశం. ఈ సినిమా గనక హిట్ అయితే టాలీవుడ్ లో కాస్త నిలదొక్కుకునేలానే కనిపిస్తోంది.

Advertisement

సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ అంటే ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినట్టే.

అయితే ఏ హీరోయిన్ అయినా టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే సినిమాలు చేయాలన్న తపనతో అక్కడి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రగ్యా కూడా దాదాపు నాలుగేళ్ళుగా బాలీవుడ్ వైపు చూస్తోంది. ఎట్టకేలకి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి బంపర్ ఆఫర్ అందుకుంది. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి జంటగా నటించే సినిమాలో. ‘ యాంటిమ్ ‘ అన్న టైటిల్ తో అనే భారీ మాఫియా యాక్షన్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కుతుండగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. కాగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

Advertisement
Advertisement