Bigg Boss Telugu 7 : ప్రియాంక జైన్‌ను పటాయించిన ప్రశాంత్.. రైతు బిడ్డకు పడిపోయిందిగా.. తట్టుకోలేకపోయిన అర్జున్.. అసలు ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 7 : ప్రియాంక జైన్‌ను పటాయించిన ప్రశాంత్.. రైతు బిడ్డకు పడిపోయిందిగా.. తట్టుకోలేకపోయిన అర్జున్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Bigg Boss Telugu 7 : ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మౌన రాగం సీరియల్ తో ఫేమస్ అయిన ప్రియాంక జైన్ ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అమర్ దీప్ కు కూడా ఆ సీరియల్ తోనే ఫేమ్ వచ్చింది. ఆ సీరియల్ లో నటించిన ఇద్దరూ బిగ్ బాస్ 7 లో అడుగు పెట్టారు. ఇద్దరూ గత మూడు నాలుగేళ్ల నుంచి ఆ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 October 2023,1:00 pm

Bigg Boss Telugu 7 : ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మౌన రాగం సీరియల్ తో ఫేమస్ అయిన ప్రియాంక జైన్ ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అమర్ దీప్ కు కూడా ఆ సీరియల్ తోనే ఫేమ్ వచ్చింది. ఆ సీరియల్ లో నటించిన ఇద్దరూ బిగ్ బాస్ 7 లో అడుగు పెట్టారు. ఇద్దరూ గత మూడు నాలుగేళ్ల నుంచి ఆ సీరియల్ కోసం కలిసి పని చేశారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అదే రిలేషన్ షిప్ ను హౌస్ లోనూ మెయిన్ టెన్ చేస్తున్నారు. టాస్కుల విషయంలో కావచ్చు.. బిగ్ బాస్ చెప్పే ఇతర విషయాల్లో కావచ్చు.. అన్నింట్లో వాళ్లు ఒక గ్రూప్ గా ఫామ్ అయి వాళ్ల పని వాళ్లే చేసుకుంటున్నారు అని పెద్ద టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా బిగ్ బాస్ విలేజ్ టాస్క్ ఇచ్చాడు. అది ఒక కెప్టెన్సీ టాస్క్. ఇప్పటికే ఒక టాస్క్ పూర్తయింది. అందులో గులాబీపురం వాళ్లు గెలిచారు. ఆ తర్వాత కపుల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో ప్రత్యేకంగా ప్రియాంక గురించే మాట్లాడుకోవాలి. ప్రియాంక అయితే ఈ టాస్క్ లో రెచ్చిపోయింది అనే చెప్పుకోవాలి. తన డ్రెస్సింగ్ స్టయిల్ మామూలుగా లేదు. హాఫ్ శారీ కట్టి పిచ్చెక్కించింది. తనను చూసి పడిపోని మగాడు లేడు. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు తనను చూసి పడిపోయారు. అంత బాగా రెడీ అయింది ప్రియాంక జైన్. ఆ డ్రెస్ వేసుకొని కిళ్లీ తీసుకొని వెళ్లి శివాజీకి తినిపిస్తుంది. నువ్వు అలా నడిచి వస్తుంటే నెమలి నాట్యం వేసినట్టు అనిపిస్తోంది అంటాడు శివాజీ. అలా శివాజీకి ప్రియాంక కిళ్లీ తినిపిస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతాడు అర్జున్. మరోవైపు ప్రియాంక అందాన్ని చూసి ప్రశాంత్ కూడా తట్టుకోలేకపోతాడు. తనను పటాయిస్తాడు. తనను బాగా ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా తను అస్సలు పడదు. నా దగ్గర 6 ఎకరాలు ఉంది.. అంటూ తనను పటాయిస్తాడు. వామ్మో.. ప్రశాంత్ కూడా ప్రియాంక మీద కర్చీఫ్ వేశాడా అని అర్జున్ తెగ కంగారు పడిపోతాడు.

prashanth flirting with priyanka jain in bigg boss 7

#image_title

Bigg Boss Telugu 7 : అద్భుతంగా నటించిన కంటెస్టెంట్లు

విలేజ్ టాస్క్ లో కంటెస్టెంట్లు అద్భుతంగా నటించారు. ఎవరి గేమ్ వారిదే. సూపర్బ్. ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్, గౌతమ్, భోలే షావలి, శివాజీ అందరూ బాగా నటించారు. బిగ్ బాస్ ముందు మంచి మార్కులు కొట్టేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది