Preity Zinta : ప్రీతి జింటా గొప్ప మనసు.. ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం..!
ప్రధానాంశాలు:
Preity Zinta : ప్రీతి జింటా గొప్ప మనసు.. ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం
Preity Zinta : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా ఒకటి. ఈ జట్టుకి సహ యజమానిగా వ్యవహరిస్తుంది ప్రీతి జింటా. ఆమె తన గొప్ప మనసును చాటుకుంది. భారత సైన్యం సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AWWA కు రూ.1.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR నిధి నుంచి ప్రీతి ఈ విరాళాన్ని అందించింది.

Preity Zinta : ప్రీతి జింటా గొప్ప మనసు.. ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం..!
Preity Zinta : మంచి మనసు..
జైపూర్‌లో జరిగిన విరాళాల కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్‌కు చెందిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రీతి జింటా కోటి రూపాయల విరాళాన్ని అందజేసి సంతోషాన్ని పంచుకుంది.సాయుధ బలగాల కుటుంబాలకు అండగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు మనం వెలకట్టలేం.
కానీ మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దాం. అందుకే సైనికుల కుటుంబాల సంక్షమం కోసమే ఈ విరాళాన్ని అందజేస్తున్నాను. ఈ మొత్తాన్ని సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నాం అని ప్రీతి జింటా పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన పంజాబ్, తొలి టైటిల్‌ను గెలుచుకుంటామనే నమ్మకంతో ఉంది.