Sai Sudharsan : సాయి సుదర్శన్ అదుర్స్.. ఎన్ని అవార్డులు దక్కాయి అంటే..!
ప్రధానాంశాలు:
Sai Sudharsan : సాయి సుదర్శన్ అదుర్స్.. ఎన్ని అవార్డులు దక్కాయి అంటే..!
Sai Sudharsan : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ యువ ప్రతిభకు పట్టం కట్టింది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు యువ సంచలనం, సాయి సుదర్శన్, ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Sai Sudharsan : సాయి సుదర్శన్ అదుర్స్.. ఎన్ని అవార్డులు దక్కాయి అంటే..!
Sai Sudharsan యువ ప్రతిభ..
ఈ సీజన్ మొత్తం నిలకడగా రాణించిన సాయి సుదర్శన్, తన అద్భుత బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించి, ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా దక్కించుకున్నాడు. అతనికి ఆరెంజ్ క్యాప్ దక్కడమే కాకుండా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, ఎక్కువ ఫోర్స్ కొట్టిన ఆటగాడిగా, ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్‌గా కూడా అవార్డులు అందుకున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. టోర్నమెంట్ ఆద్యంతం అసాధారణ ఫామ్‌ను కొనసాగించిన అతను, మొత్తం 15 మ్యాచ్‌లలో 54.21 అద్భుత సగటుతో 759 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అజేయ శతకం (108*), 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 156.17గా ఉంది
SUPER SAI’yaaaan! 🤩🔥
👉🏻 Orange Cap! 🧢
👉🏻 Emerging Player of the Season! 🙌🏻
👉🏻 Most 4s in the season! 😯
👉🏻 Fantasy KING of the season! 👏🏻
An appreciation post for a player who truly made the 22 yards his own with consistent brilliance in #TATAIPL 2025! 🙌🏻