Preity Zinta : అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Preity Zinta : అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2025,2:10 pm

ప్రధానాంశాలు:

  •  Preity Zinta : అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో

Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించింది పంజాబ్ జ‌ట్టు. ఆ విజ‌యంతో పంజాబ్ సంబరాల‌ మధ్య ప్రజెంటేషన్ సెర్మనీ సమయంలో ప్రీతి జింటా పంజాబ్ ఆటగాళ్లలో ఒకరి వైపు చూసి కన్నుగీటిన దృశ్యం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

Preity Zinta అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా కేక పెట్టిస్తున్న వీడియో

Preity Zinta : అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో

Preity Zinta క్యూట్ ఎక్స్ ప్రెష‌న్..

ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో నాటౌట్ 87 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించిన పంజాబ్, దశాబ్దానికి పైగా తర్వాత ఐపీఎల్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 2014 తర్వాత ఇదే తొలి అవకాశం కాగా, అయ్యర్ కెప్టెన్‌గా వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో పాల్గొనబోతున్నాడు.

గతేడాది KKR తరఫున విజేతగా నిలిచిన శ్రేయస్, ఇప్పుడు PBKS తరఫున అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. అయితే పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో శ్రేయాస్, వధేరా కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడారు. వారు ఆడుతున్నంత‌ సేపు ప్రీతి జింటా ఉత్సాహానికి అదుపులేకుండా పోయింది. సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పడల్లా చిన్న పిల్లాల మాదిరిగా గెంతులు వేసింది. జట్టు ఓనర్ అనే విషయాన్ని మరిచిపోయి.. క్రికెట్ అభిమానిగా ముఖ్యంగా పంజాబ్ ఫ్యాన్స్‌గా మారిపోయింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది