Mumbai Indians : ముంబైని ప్లే ఆఫ్స్ వరకు తీసుకొచ్చింది ఆ ఇద్దరే..!
ప్రధానాంశాలు:
Mumbai Indians : ముంబైని ప్లే ఆఫ్స్ వరకు తీసుకొచ్చింది ఆ ఇద్దరే..!
Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం అద్భుతం. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఈ జట్టు ఈ ఏడాది మొదట్లో కూడా తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడింది. ఆ తర్వాత ఒక మ్యాచ్ లో నెగ్గింది. మళ్లీ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడింది. తొలి ఐదు మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే నెగ్గింది. అయితే బుమ్రా గాయం నుంచి కోలుకొని రావడం ముంబైకి కొండంత బలాన్ని ఇచ్చింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చాక ముంబై వరుస విజయాలతో హోరెత్తించింది.

Mumbai Indians : ముంబైని ప్లే ఆఫ్స్ వరకు తీసుకొచ్చింది ఆ ఇద్దరే..!
Mumbai Indians ఆ ఇద్దరే మూలం..
ఐపీఎల్ ఆరంభం ముందు వరకు పేలవ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా టచ్ లోకి వచ్చాడు. సునామీ ఇన్నింగ్స్‌లను ఆడటం మొదలు పెట్టాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.సూర్యకుమమార్ యాదవ్ 13 మ్యాచ్ ల్లో 72.87 సగటుతో 583 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్నాడు.
ఇక జస్ ప్రీత్ బుమ్రా కూడా తన పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. ఇప్పటి వరకు కేవలం 9 మ్యాచ్ ల్లోనే 16 వికెట్లు తీశాడు. 6.39గా ఉంది. వీరిద్దరు నిలకడగా ఆడటం వల్లే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అయితే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. రోహిత్ కాస్త పర్వాలేదు. తిలక్ వర్మ కూడా ఫాంలో లేడు. వీరందరు సమిష్టిగా ఆడితే ముంబై ఈ సారి కప్ కొట్టడం కష్టమేమి కాదు.