Intinti Gruhalakshmi 13 Oct Today Episode : ప్రేమ్, అక్షర పెళ్లిలో మరో ట్విస్ట్.. తులసిని తాళి తీసేయ్ అన్న నందు.. పెళ్లి తంతు ఇప్పట్లో ముగిసేనా?
Intinti Gruhalakshmi 13 Oct Today Episode : బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో ప్రజెంట్ ప్రేమ్, అక్షర పెళ్లి తంతు కొనసాగుతూనే ఉంది. ట్విస్ట్‌ల మీద ట్విస్టులతో పెళ్లి ఎప్పుడు జరుగుతుందోననే ఆసక్తి ప్రేక్షకులలో క్రియేట్ అవుతోంది. బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..శ్రుతి పెళ్లి మండపానికి వస్తే ఎక్కడ ప్రేమ్ మనసు మారుతుందోనని నందు శ్రుతిని స్టోర్ రూంలో లాక్ చేశాడు. ఈ క్రమంలోనే అందరు పెళ్లి మండపానికి బయల్దేరి వస్తారు. ఇకపోతే పెళ్లి పీటలపై ప్రేమ్, అక్షర కూర్చొని ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుంటున్న తనయుడిని చూసి తులసి బాధపడుతుంది.
ప్రేమ్ ఇష్టపడిన శ్రుతిని ప్రేమ్‌కు ఇవ్వలేకపోతున్న బాధను తులసి వ్యక్తం చేస్తుంది. ఇకపోతే ఈ విషయాలపై తులసి, నందు మధ్య డిస్కషన్ వస్తుంది. దాంతో నందు స్పందిస్తూ.. తాను నిన్ను ఇష్టపడి చేసుకున్నానని, అలా చేసి
Intinti Gruhalakshmi 13 Oct Today Episode : పెళ్లిపీటలపైనున్న ప్రేమ్ తనకు ఫోన్ చేస్తున్నాడేంటని కంగారుపడిపోయిన శ్రుతి..
ఆ తాళి ఉండటం వల్ల చేసిన తప్పులు గుర్తు చేయబడతాయని, అందుకే అలా ఉంచుకుంటున్నానని చెప్తుంది తులసి. మరో వైపున పెళ్లి బట్టలు తీసుకొస్తానని చెప్పి వెళ్లిన శ్రుతి ముహుర్తం దగ్గరపడుతున్నా ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందుతుంది తులసి. ఇకపోతే పెళ్లి పీటలపై తన కూతురు అక్షరను చూసి తండ్రి జీకే కన్నీటిపర్యంతమవుతాడు. ఈ క్రమంలోనే పెళ్లిపీటలపైనున్న ప్రేమ్ స్యాడ్ ఫేస్ పెట్టడంతో అక్షర అతడిని నవ్వాలని అంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రుతి పెళ్లి మండపానికి రావడంతో తులసి ప్రేమ్ ఫోన్ నుంచి శ్రుతికి ఫోన్ చేస్తుంది.
స్టోర్ రూంలో ఉన్న శ్రుతి తనకు పెళ్లి పీటలపైనున్న నవ వరుడు ప్రేమ్ నుంచి ఫోన్ రావడం ఏంటని ఆశ్చర్యపడుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే వదిలేస్తుంది. శ్రుతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధపడుతుంది తులసి. ఆ టైంలో తులసి తమ్ముడు మోహన్ వచ్చి బాధపడొద్దని అంటాడు. ఇకపోతే శ్రుతి ఇంకా రాలేదని, పెళ్లి బట్టలు తెస్తానని ఇంకా రావడం లేదని అంటుంది తులసి. ఆ మాటలు విన్న మాధవి ‘అదేంటీ.. నేను పెళ్లి బట్టలు అప్పుడే ఇచ్చేశాను’అని చెప్తుంది. దాంతో శ్రుతి ఎక్కడికి వెళ్లి ఉంటుంది మరి..
అని ఆందోళన చెందుతుంది తులసి. ఈ క్రమంలోనే పెళ్లిపీటలపైకి పెళ్లి బట్టలతో వెళ్లేందుకుగాను ఏర్పాట్లు జరుగుతుంటాయి. మరో వైపున శ్రుతి ఎక్కడికి వెళ్లి ఉంటుందని తులసి అనుకుంటుంది. ఇకపోతే పెళ్లి బట్టలు వేసుకునేందుకుగాను ప్రేమ్ అంగీకరించడు. శ్రుతిని గురించి తలుచుకుని రూమ్ లోనే ఏడుస్తుంటాడు. తన స్వార్థం కోసం అక్షర మెడలతో తాళి కట్టబోనని అనుకుంటాడు. మరో వైపున శ్రుతి సైతం ప్రేమ్‌ను గురించి తలుచుకుని ఏడుస్తూనే ఉంటుంది.
అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఎపిసోడ్‌కుగాను పెళ్లి సమయంలో ముఖ్య ఘట్టమైన కన్యాదానం హై లైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. తులసి స్థానంలో లాస్య కన్యాదానం చేస్తుందా? ఇంతకీ పెళ్లి ఘట్టం ఎప్పుడు ముగుస్తుందనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లోనే తేలనుంది.