Bigg Boss Telugu 7 : శభాష్ యావర్.. అదరగొట్టేశావు.. హౌస్ అంతా కలిసినా యావర్ ను ఏం చేయలేకపోయారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : శభాష్ యావర్.. అదరగొట్టేశావు.. హౌస్ అంతా కలిసినా యావర్ ను ఏం చేయలేకపోయారు

 Authored By kranthi | The Telugu News | Updated on :21 September 2023,11:37 am

Bigg Boss Telugu 7 : అది యావర్ అంటే. శభాష్.. ఇన్ని రోజులు యావర్ ను కేవలం ఫిజికల్ టాస్క్ లో మాత్రమే బాగా ఆడుతాడు అంటూ ఇంటి సభ్యులు మొత్తం రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఫిజికల్ టాస్క్ మాత్రమే ఆడుతాడు. బుర్ర పెట్టడు. బుర్ర పెట్టి ఆడితే ఇంకా బాగుంటుంది అంటూ చాలామంది బిగ్ బాస్ ముందు యావర్ గురించి చెప్పారు. చివరకు మాస్టర్ కూడా రెండో పవరాస్త్ర కంటెండర్ గా యావర్ ను కాకుండా అమర్ ను సెలెక్ట్ చేస్తాడు. అలాగే.. బిగ్ బాస్ కూడా యావర్ ను మూడో పవరాస్త్ర కోసం కంటెండర్ గా సెలెక్ట్ చేయడంపై కొందరు ఇంటి సభ్యులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

prince yawar wins the contender task in bigg boss 7

#image_title

ఇవన్నీ గుర్తించిన బిగ్ బాస్ నువ్వు మూడో కంటెండర్ గా ఎందుకు అర్హుడివో.. ఈ టాస్క్ ద్వారా నిరూపించుకోవాలని ఒక టాస్క్ ఇస్తాడు. ఒక పెద్ద స్టాండ్ మీద తన తల పెట్టాలి. ఇంటి సభ్యులు మొత్తం ఆయన్ను డిస్టర్బ్ చేయాలి. ఎంత డిస్టర్బ్ చేసినా తన దవడను మాత్రం పైకి లేపకూడదు. బిగ్ బాస్ చెప్పే వరకు దవడను అస్సలు పైకి తీయొద్దు. అదే టాస్క్. ఆ టాస్క్ కు సంచాలకులుగా మాస్టర్, శివాజీని సెలెక్ట్ చేస్తాడు బిగ్ బాస్.

Bigg Boss Telugu 7 : రెచ్చిపోయిన కంటెస్టెంట్లు

ఇక.. యావర్ కు ఆ టాస్క్ ఇవ్వడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. విపరీతంగా ఆయన్ను టార్గెట్ చేసి ఐస్ వేయడం, చెవుల్లో పుల్లలు పెట్టి గెలకడం, చివరకు బిగ్ బాస్ పెండ, గడ్డి కూడా పంపించడంతో.. పెండ మొహం మీద కొట్టడం, గడ్డి నెత్తి మీ పెట్టడం, పెండ ముఖాన పూయడం.. అన్నీ చేశారు. ఏం చేసినా యావర్ మాత్రం తన దవడను పైకి లేపలేదు. అస్సలే లేపలేదు. చివరకు బిగ్ బాస్ యావర్ ను కంటెండర్ గా సెలెక్ట్ చేస్తాడు. అది టాస్క్ లో పార్టిసిపేట్ చేయడం అంతే. తను ఫిజికల్ టాస్కులే కాదు.. ఏ టాస్క్ అయినా చేసి చూపిస్తా అని నిరూపించాడు యావర్. మొత్తానికి మూడో హౌస్ మెట్ గా ఉండేందుకు యావర్ కంటెండర్ గా స్థానం సంపాదించాడు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది