Priyamani : ఒక్క మెసేజ్ తో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రియమణి.. ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందనుకోలేదు..!

Authored By Rame Samhith | The Telugu News | Updated on : 25 October 2022, 8:40 pm

Priyamani : కర్ణాటక నుంచి వచ్చిన భామలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. వీరిలో అందాల భామ ప్రియమణి కూడా ఉంది.ఆమె అభినయం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. అందుకే తెరంగేట్రం చేసి రెండు దశాబ్ధాలు అవుతున్నా ఇప్పటికీ అమ్మడికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో కలిసి నటించిన ప్రియమణి ఓ మోస్తారు క్రేజ్ తెచ్చుకుంది. తమిళ సినిమా పరుత్తివీరన్ సినిమాతో నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది ప్రియమణి. నాలుగు సౌత్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మెప్పించింది ప్రియమణి.

2017లో ముస్తఫా ని పెళ్లి చేసుకున్న ప్రియమణి పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వస్తుంది. ఈటీవీ ఢీ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కు మరోసారి దగ్గరైన అమ్మడికి మళ్లీ ఇక్కడ అవకాశాలు వచ్చాయి. ఇక ఇదిలాఉంటే ప్రియమణి తన భర్త ముస్తఫాతో దూరంగా ఉంటుంది. ఆయన అమెరికాలో ఉంటే ఈమె ఇండియాలో ఉంటుంది. కెరియర్ కోసం ఆయన అక్కడ ఈమె ఇక్కడ ఉంటున్నారు. అయితే ఈ గ్యాప్ ఇప్పుడు బాగా పెరిగిందని టాక్. కొన్నాళ్లుగా ప్రియమణి తన భర్త ముస్తఫా కి డైవర్స్ ఇస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు ముస్తఫా కానీ.. ఇటు ప్రియమణి కూడా స్పందించలేదు.

priyamani clarity about her divorce diwali wishesh

priyamani clarity about her divorce diwali wishesh

దీపావళి సందర్భంగా ఇంట్లో సంబరాలు జరుపుకున్న ప్రియమణి ఒక్క మెసేజ్ తో వార్తలన్నిటికీ చెక్ పెట్టేసింది. అందరికి దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రియమణి నా నుంచి నా ఫ్యామిలీ నుంచి మీకు పండుగ శుభాకాంక్షలు అని చెప్పింది. అంతేకాదు చివర్లో మిస్ యు ముస్తఫా అని కూడా కామెంట్ పెట్టింది. ప్రియమణి, ముస్తఫా విడిపోయారు అన్న వార్తలకు క్లారిటీ ఇస్తూ ప్రియమణి పెట్టిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న ప్రియమణి కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తుంది. అమ్మడి ఫాం చూస్తుంటే ఖచ్చితంగా మరో ఐదేళ్లు వరుస సినిమాలు చేసేలా ఉంది. ప్రయోగాత్మక పాత్రల్లో కూడా ఆమె చేసేందుకు సై అంటుంది.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి