Priyamani : ప్రియమణి పెళ్లిపై గందగగోళం.. ఆమె ఆరోపణలతో కొత్త మలుపు
Priyamani : ప్రియమణి, ఆమె భర్త ముస్తఫా రాజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ అన్యోన్యంగానే జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ ఇద్దరి జీవితంలో ఓ కొత్త మలుపు వచ్చింది. ప్రియమణితో ముస్తాఫాకు పెళ్లయ్యేనాటికి ఆయనకు ఓ భార్య ఉంది. ఆమె పేరు ఆయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ దంపతుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు.

Priyamani Marriage Gets In Trouble
అయితే ఈ క్రమంలో ముస్తఫా 2017లో ప్రముఖ నటి ప్రియమణిని పెళ్లాడాడు. రెండో పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లల కోసం ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు. తన భర్త పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఆయేషా మీడియా ముందు వాపోయింది. దీంతో ఈ ఆరోపణలను ముస్తఫా తోసిపుచ్చాడు. తన మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని అన్నాడు
ప్రియమణి పెళ్లిపై కొత్త మలుపు Priyamani
పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బును ఆయేషాకు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కానీ ఆమె నా దగ్గర నుంచి మరింత డబ్బును దొంగిలించాలని చూస్తోంది. పైగా హింసించానంటూ మాట్లాడుతోంది. మరి నేను తనను హింసింస్తే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించాడు.

Priyamani Marriage Gets In Trouble
మరోవైపు ఆయేషా మాత్రం ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని పేర్కొంది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదు. ఎందుకంటే ప్రియమణిని పెళ్లి చేసుకునేనాటికి కనీసం మేము విడాకుల కోసం కూడా దరఖాస్తు చేయలేదు. కాబట్టి ఇది అక్రమం కిందకే వస్తుంది. ఇద్దరు పిల్లల తల్లిగా మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండంటూ ఆయేషా తన గోడును వెల్లగక్కుంది.
ఇది కూడా చదవండి ==> శ్రీముఖి పరువుపాయే.. శరీరాకృతిపై సద్దాం కామెంట్స్
ఇది కూడా చదవండి ==> బ్లాక్ డ్రస్‌లో రంగమ్మత్త అదరహో.. వైరల్ ఫిక్స్…!
ఇది కూడా చదవండి ==> టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఏరా రవి… విష్ణుప్రియ ఓవర్ యాక్షన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్ రవి…!