Priyanka Jawalkar : నచ్చితే అలాంటి వాటికి కూడా ఓకే!.. టాక్సీవాలా భామ మరీ నాటు
Priyanka Jawalkar : టాక్సీవాలా భామ ప్రియాంక జవాల్కర్ చేస్తోన్న సినిమాలు, పోషిస్తోన్న పాత్రల గురించి అందరికీ తెలిసిందే. తెలుగమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్‌కు ఆశించినంతగా అవకాశాలు రావడం లేదు. అయితే తాజాగా ప్రియాంక నటించిన గమనం అనే సినిమా రాబోతోంది. డిసెంబర్ 10న ప్రియాంక జవాల్కర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
టాక్సీవాలా సినిమా సక్సెస్‌ను వాడుకోలేకపోయాను అని కొంత మంది అంటారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధిని మనం మార్చలేం. కొన్ని సినిమాలు మనకు వద్దనుకున్నా వస్తాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు ఇంత హిట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు. గమనం సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నానని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Priyanka Jawalkar On Character Offers
Priyanka Jawalkar : బోల్డ్ కారెక్టర్స్‌కు ప్రియాంక ఓకే
ఇక నెట్ ఫ్లిక్స్‌లో ఓ వెబ్ సిరీస్ ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. బోల్డ్ కారెక్టర్ కూడా చేస్తాను. అర్జున్ రెడ్డి సినిమాను అందరూ బోల్డ్ అన్నారు. కానీ నాకు చాలా నచ్చింది. పాత్రకు సూట్ అవుతుందంటే బోల్డ్ కారెక్టర్ చేసేందుకు కూడా రెడీనే అంటూ మరీ నాటుగా సమాధానాలు చెప్పేసింది ప్రియాంక.
Advertisement
WhatsApp Group
Join Now