Priyanka Singh : అలా చేస్తాడని అనుకోలేదు!.. మానస్ నిజస్వరూపం తెలుసుకున్న ప్రియాంక
Priyanka Singh : బిగ్ బాస్ ఇంట్లో ఉండటం వేరు.. బయటకు వచ్చి చూడటం వేరు. ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ప్రియాంకకు.. తన వెనకాల తన గురించి ఏం మాట్లాడుకున్నారో తెలీదు. కానీ ఒక్కసారి బయటకు వచ్చాక మాత్రం ఎవరేం మాట్లాడుకున్నారో చూసుకోవచ్చు. అలా ఇప్పుడు మానస్ తన గురించి మాట్లాడిన మాటలను ప్రియాంక విని షాక్ అయింది.
సన్నీకి ఫినాలే టికెట్ వచ్చిన తరువాత మానస్, కాజల్ మాట్లాడుకున్న విషయం బాగానే వైరల్ అయింది. ప్రియాంక కావాలనే సన్నీతో క్లోజ్‌గా ఉంటోందని, ఫినాలే టికెట్ కోసమే క్లోజ్‌గా ఉంటుందేమోననే అనుమానం నాకు కలుగుతోందని అంటూ మానస్ చెప్పడం.. కాజల్ కూడా ఊ కొట్టడం మనం చూశాం. ఆ ఘటన మీద ఇప్పుడు ప్రియాంక రియాక్ట్ అయింది.

priyanka singh on manas in bigg boss buzz interview
Priyanka Singh : ప్రియాంక కంటతడి
బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రియాంక.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అసలు విషయం తెలుసుకుంది. అరియానా ఓ వీడియోను చూపించడంతో ప్రియాంక కళ్లు తెరిచింది. మానస్ అలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు అంటూ ప్రియాంక ఎమోషనల్ అయింది. మొత్తానికి మానస్ చివరి వరకు ఉంటాడని, టైటిల్ గెలుస్తాడని ప్రియాంక చెప్పింది.
