Pooja Hegde : స్టేజ్ ను షేక్ చేసింది.. సినిమాల్లో కూడా ఇలా డ్యాన్స్ చేసి ఉండదు.. పూజా హెగ్డే స్టెప్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే
Pooja Hegde : పూజా హెగ్డే.. పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో పాటు కిర్రాకు డ్యాన్స్ స్టెప్స్ వేస్తుంది పూజా. అందుకే తను బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే భేదం లేకుండా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తను ఫిట్ నెస్ ఫ్రీక్. పూజా హెగ్డే అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనను పొగుడు కాళ్ల సుందరి అంటూ తన అభిమానులు పిలుచుకుంటారు. తన అందానికి ఫిదా కాని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.
నిజానికి పూజా హెగ్డే కోలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో 2014 లో నాగ చైతన్య.. ఒక లైలా కోసం అనే సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో నటించింది. డీజే, అల వైకుంఠపురంలో, మహర్షి, రాధే శ్యామ్, ఆచార్య సినిమాల్లో నటించింది. అవార్డు ఫంక్షన్ లో ఇటీవల పూజా హెగ్డే పాపులర్ తెలుగు సాంగ్స్ కు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. తన డ్యాన్స్ కు స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది.

Pooja Hegde dance video on viral
Pooja Hegde : అవార్డ్స్ ఫంక్షన్ లో పూజ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్
అవార్డ్ ఫంక్షన్ లో పూజ డ్యాన్స్ చూసి ఆడియెన్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. రాములో రాములో పాటకు, బుట్ట బొమ్మ, సీటీమార్ లాంటి పాటలకు స్టెప్పులను అదరగొట్టేసింది. వామ్మో.. అసలు సినిమాలో కూడా ఇంతలా పాటలకు డ్యాన్స్ చేయలేదు.. అని ముక్కున వేలేసుకోవాల్సిందే. కంటిన్యూగా ఓ 10 నిమిషాల పాటు పూజ వేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లే షాక్ అయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.
