Jabardasth Faima : ఫైమాను దారుణంగా కించపరిచేశాడు.. పరువుతీసిన పంచ్ ప్రసాద్
Jabardasth Faima : బుల్లితెరపై ఇప్పుడు ఫైమా ఒక సంచలనం. ఎక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తోంది. ఆమె ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడింది. ఒకప్పుడు పటాస్ షోలో ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. అలా మెల్లిమెల్లిగా ఎదిగింది. తనది తాను నిరూపించుకుంది. ఎలాంటి స్కిట్లోనైనా, ఎలాంటి పాత్రలోనైనా ఇమడగలను అని సత్తా చాటింది. తన ఆహార్యమే మైనస్ అంతా అన్నారు. కానీ ఆ ఆహార్యాన్నే బలంగా మార్చుకుంది ఫైమా. నల్లగా, బక్కగా, పొట్టిగా ఉన్నావని అందరూ కామెంట్ చేశారు.

punch prasad on jabardasth faima in rechipodam brother
కానీ ఇప్పుడు మాత్రం ఫైమా రేంజ్ మారిపోయింది. ఫైమాకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ప్రతీ షోలో ఫైమా కనిపిస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ, రెచ్చిపోదాం బ్రదర్ ఇలా అన్నింట్లోనూ ఫైమా దూసుకెళ్తోంది. అయితే తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షో ప్రోమో వచ్చింది. అందులో పంచ్ ప్రసాద్ రెచ్చిపోయాడు. ఏ ఒక్కరినీ వదిలపెట్టలేదు. మరీ ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్, ఫైమాలను ఆడుకున్నాడు. ఇక బాబా భాస్కర్ అయితే ఫుల్లుగా నవ్వేస్తున్నాడు.
Jabardasth Faima : పరువుతీసిన ప్రసాద్..

punch prasad on jabardasth faima in rechipodam brother
డైలాగ్స్ మరిచిపోయేలా చేయకు అని బాస్కర్ అంటే.. అక్కడేదో పెద్ద ఉన్నట్టు అని పరువుతీస్తాడు. సర్కస్‌లో రింగ్ మాస్టర్‌లా భాస్కర్ నటించినట్టున్నాడు. ఇక ఫైమా మీద పంచ్ ప్రసాద్ దారుణమైన కామెంట్లు చేశాడు. దాని మొహం చూడు సులభ్ కాంప్లెక్స్ కడిగేదానిలా ఉంది.. దానికేసేయ్ అని అంటాడు. మొత్తానికి ఫైమా మాత్రం ఇలాంటి కామెంట్లను ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇంతటి పాపులారిటీని సొంతం చేసుకుంది.
