Pushpa : ఊ అంటావా పాటకు కొరియోగ్రాఫర్ డ్యాన్స్.. భలే కామెడీగా ఉందిగా..!
Pushpa : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లామర్ బ్యూటీ రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన పాన్‌ఇండియా మూవీ ‘పుష్ప.’ ఈ ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని పాటలన్నీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసింతే. ముఖ్యంగా హీరోయిన్ సమంత ఆడిపాడిన ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ పాటకు పెద్దఎత్తున ప్రజాదరణ లభిస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. పలువురు ఈ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఆఫ్రికా దేశమైన టాంజానియాలో సోషల్ మీడియా స్టార్ కిలిపాల్ ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ పాటకు తనదైనశైలిలో స్టెప్పులేసి అలరించింది.
ఈ పాటకు పలువురు ప్రముఖులు కూడా స్టెప్స్ వేసి సందడి చేశారు. అయితే ఈ సినిమా పాటకే కాదు స్టెప్పులు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించగా, తాజాగా ఆయన కొరియోగ్రఫీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా సీరియస్‌గా ఆయన డ్యాన్స్ చేస్తుండగా, పక్కనే ఉన్న బన్నీ సమంత తెగ నవ్వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ ఆకట్టుకుంటుంది. నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

pushpa Choreographer dance Bts in video viral
Pushpa : బీటీఎస్ వీడియో వైరల్
సమంత అప్పటివరకు ఒక స్పెషల్ సాంగ్ చేయగలదని, అందులో అంత హాట్‌గా కనిపించగలదని ఎవరూ ఊహించలేదు. పుష్పలోని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట చూసేవరకు. అప్పటివరకు సాఫ్ట్ రోల్స్‌లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సమంతను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ సాంగ్ కోసం సమంత ఎంత కష్టపడిందో ఒక్క వీడియోలో చూపించేశారు. అందులో సమంత చాలా హార్డ్ వర్క్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
A BTS video of Allu Arjun and Samantha from #Pushpa goes viral! #AlluArjun #SamanthaRuthPrabhu #ooantavaooooantava #Pushpa pic.twitter.com/5pKFjmmZWz
— Hyderabad Times (@HydTimes) January 18, 2022