Pushpa : ‘పుష్ప’లో కేశవ క్యారెక్టర్ తనకు రావాల్సిందన్న మహేశ్ విట్టా.. కానీ..!
Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’.. సూపర్ హిట్ మూవీగా దూసుకుపోతున్నది. ఇకపోతే ఈ చిత్రంలో బన్నీ తర్వాత అంతటి పేరు ‘కేశవ’ పాత్ర పోషించిన జగదీశ్‌కు వచ్చింది. నార్త్ ఇండియాలో ఈ పిక్చర్ చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. కాగా, ఈ పాత్ర కోసం తాను ఆడిషన్స్ కు వెళ్లానని చెప్పుకొచ్చారు మహేశ్ విట్టా. అయితే, చివరకు.. ఆ పాత్ర తనకు దక్కలేదని అన్నాడు.‘పుష్ప’ సినిమాలో కేశవ పాత్ర పోషించేందుకుగాను ఆడిషన్స్ కోసం తాను వెళ్లానని మహేశ్ విట్టా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే,
ఈ కేశవ రోల్ కోసం చాలా మందిని ఆప్షన్స్ గా పెట్టుకున్న డైరెక్టర్.. చివరకు జగదీశ్ ను సెలక్ట్ చేశాడు. అయితే, తాను కూడా సెలక్ట్ అయ్యానని ఒక దశలో భావించానని మహేశ్ విట్టా చెప్పుకొచ్చాడు. కాగా, చివరకు తనను పిలవలేదని, జగదీశ్ ను ఆ పాత్రకు ఎంచుకున్నారని తెలిపాడు.తాను ఒకే సినిమా రెండేళ్ల సమయం ఇస్తానో లేదో అని అనుకున్నారే ఏమో తెలియదు. కానీ, తాను మాత్రం తెరపైన కేశవ పాత్రను చూసి తెగ ఎంజాయ్ చేశానని తెలిపాడు మహేశ్ విట్టా.
Pushpa : వెండితెరపై కేశవ పాత్ర చూసి ఆనందపడ్డా: మహేశ్ విట్టా..
అయితే, అంత మంచి పాత్రకు తనను కూడా అనుకున్నారనే సంతృప్తి అయితే తనకు ఉందని ఆనందపడిపోయాడు. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా తనను ఏదేని పాత్రకోసం పిలుస్తారని తాను భావిస్తున్నానని మహేశ్ విట్టా అన్నాడు. చిత్తూరు యాసలో అల్లు అర్జున్ ఇరగదీశారని, స్పష్టంగా అలాగే డైలాగ్స్ చెప్పి బన్నీ ఆశ్చర్యపరిచాడని వివరించాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన నటించగా, విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించాడు. కీలక పాత్రల్లో అనసూయ భరద్వాజ్, సునీల్ కనిపించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.