Pushpa Movie Fame keshava : పుష్ప 2 షూటింగ్ మధ్యలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవ..!

Authored By aruna | The Telugu News | Published on: December 17, 2023, 9:00 pm
  •  Pushpa Movie Fame keshava : పుష్ప 2 షూటింగ్ మధ్యలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవ..!

Pushpa Movie Fame keshava : గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు యూట్యూబర్ అయిన చందు సాయి ఇద్దరు అరెస్ట్ అవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎందుకు అరెస్టు అయ్యారా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఆర్టిస్టులుగా ఎదుగుతున్న వీళ్ళు పోలీసుల చేతిలో చిక్కి, అమ్మాయిలకు సంబంధించిన కేసులో ఇరుక్కుంటున్నారు. వీళ్లకు కెరీర్ మీద ఆసక్తి ఉందా లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పక్కింటి కుర్రాడు చందు గాడు అనే వెబ్ సిరీస్ తో బాగా ఫేమస్ అయిన చందు సాయి ఇటీవల అరెస్టు అయ్యారు. ఒక అమ్మాయిని రేప్ అటెప్ట్ చేయబోయాడు అని, ఆ అమ్మాయితో కొన్ని రోజులు రిలేషన్ షిప్ లో ఉండి, ఆమెను మోసం చేశాడనిమ ఆ అమ్మాయి కేసు పెట్టడంతో పోలీసులు చందు సాయిని అరెస్టు చేశారు.

చందు సాయి కుటుంబం మీద కూడా కేసు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వస్తున్న చందు సాయి ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మరోపక్క పుష్ప సినిమాతో ఫేమస్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేశవ ను కూడా ఇటువంటి కేసులోనే పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప మేకింగ్ లో కేశవ ఇబ్బంది పడుతున్నట్లుగా తెలు స్తుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కేశవ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే కేశవాకి బెయిల్ ఇప్పించి మరి షూటింగ్లో పాల్గొనేలా చేయడానికి పుష్ప టీం కసరత్తులు చేస్తున్నారట.

కేశవ , చందు సాయి ఇద్దరూ కూడా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చందు సాయి సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్ర చేశాడు. వెబ్ సిరీస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఇక కేశవ కూడా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీ లోకి ఎదగాలనుకునే వాళ్ళు తమ పని వాళ్లు చేసుకుంటూ పోవాలి కానీ ఇలాంటి చెడు పనులు చేస్తే కెరీర్ అనేది కచ్చితంగా దెబ్బతింటుంది. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చేవారు తమ ఫోకస్ అంతా నటన పైనే ఉండాలి. ఇలాంటి వ్యవహారాలలో చిక్కుకొని కెరీర్ నాశనం చేసుకుంటే ఎలా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp