Sukumar : సుకుమార్‌ను నమ్మి ‘పుష్ప’ నిర్మాతలు ఎంత నష్టపోయారంటే?
Sukumar : టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన సినిమాలు ఆడియెన్స్‌కు మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంటాయి. గతంలో వచ్చిన సినిమాలు ఆయన స్టామినా ఎంటో టాలీవుడ్‌కు రుచి చూపించాయి. భారీ కథనంతో పాటు హీరోలను డిఫరెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేయడంలో సుకుమార్ ముందుంటారు. అయితే, ఇంతవరకు సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు అన్నీ రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం.. కానీ ఫస్ట్ టైం తన కెరీర్‌లో అర్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా రేంజ్ మూవీని డైరెక్ట్ చేశారు సుక్కు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. డిసెంబర్ 17న థియేటర్ల ముందుకు వచ్చిన పుష్ప మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది.
సుకుమార్, నిర్మాతల అంచనాలు తప్పాయి.పుష్ప సినిమాను సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.అందుకోసం భారీగా బడ్జెట్ అనుకున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో స్టోరీని అనుకున్నారు. భారీ తారగణం, హై వాల్యూ టెక్నిషియన్లు, విజువల్ పరంగా కూడా ఈ సినిమా ఓ రేంజ్‌లో కనిపించింది. కానీ మొదటి భాగం ఆడియెన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్నిచోట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటే మరికొన్నిచోట్ల మాత్రం కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. పేరుకే పాన్ ఇండియా వైడ్ మూవీ రిలీజ్ అయ్యింది. కలెక్షన్స్ 200 కోట్లు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కానీ నిర్మాతలకు మాత్రం భారీగానే దెబ్బ పడిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Sukumar : అతిగా ఊహించుకోవడమే కొంపముంచిందా?
‘పుష్ప ది రైజ్’ మూవీకి కేవలం ఎడిటింగ్ మీదనే రూ. 25 నుంచి 30 కోట్ల మేర ఖర్చు అయ్యిందని టాక్..సినిమాకు కలెక్షన్స్ ఎలా ఉన్నా కేవలం ఎడిటింగ్ కోసం నిర్మాతలు దాదాపు 30 కోట్లు పెట్డడం అంటే టు మచ్ అని అంటున్నారు సినీ పెద్దలు.. ఈ బడ్జెట్‌తో ఒక చిన్న సినిమాను తీయొచ్చు. సుకుమార్ మరి ఎంత పెద్దగా సినిమా తీసే బదులు సినిమాకు ఏదైతే ప్లస్ అవుతుందో ఈ సీన్లు షూట్ చేస్తే ఎడిటింగ్ కోసం పెట్టే ఖర్చును వేరే వాటికోసం ఉపయోగించొచ్చు అని నిర్మాతల వెర్షన్.. ఫస్ట్ పార్ట్ ఎలా ఉన్నా సెకండ్ పార్ట్ మీద సుక్కు ఫోకస్ పెట్టకపోతే నిర్మాతల భారీగా నష్టపోవాల్సి వస్తుందని టాక్ వినిపిస్తోంది.