Ram Charan : రామ్ చరణ్ సుకుమార్ నుండి రానున్న సర్‌ప్రైజ్.. హీరోయిన్స్‌గా ఎవరెవరు అంటే..!
ప్రధానాంశాలు:
Ram Charan : రామ్ చరణ్ సుకుమార్ నుండి రానున్న సర్‌ప్రైజ్.. హీరోయిన్స్‌గా ఎవరెవరు అంటే..!
Ram Charan : గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ చూసిన రామ్ చరణ్ Ram Charan ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వాలని పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట టీమ్.

Ram Charan : రామ్ చరణ్ సుకుమార్ నుండి రానున్న సర్‌ప్రైజ్.. హీరోయిన్స్‌గా ఎవరెవరు అంటే..!
Ram Charan హీరోయిన్స్ ఎవరంటే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప2 Pushpa2ను తెరకెక్కించి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాశాడు సుకుమార్ . ఈసినిమాతో బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాలో హీరోయిన్స్‌గా సమంత, రష్మిక మందన్నను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. సుకుమార్ సెంటిమెంట్ ప్రకారం ఒక సారి తన సినిమాల్లో నటించిన హీరోయిన్‌ను మళ్లీ రిపీట్ చేయడు.
కానీ.. గ్లోబల్ స్టార్ చరణ్ RAm Cahran కోసం సుకుమార్ ఇలా తొలిసారి తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడని టాక్. ఈ విషయంలో నిజానిజాలు ఏంటి అనేది తెలియదు కాని.. అసలు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి.. హీరోయిన్ ను ఫిక్స్ చేస్తే కాని అసలు నిజం తెలియదు. కాని ఇండస్ట్రీలో మాత్రం చాలా బలంగా వినిపిస్తున్న టాక్ ఇది. మరోవైపు ఈ సినిమాలో సమంత కూడా ఓ చిన్న పాత్ర పోషిస్తుందని టాక్ వినిపిస్తుంది.