Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం.. చరణ్ మూవీ ఎప్పుడు ?
ప్రధానాంశాలు:
Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం.. చరణ్ మూవీ ఎప్పుడు ?
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే విషయం చర్చనీయాంశం అయింది. షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతున్నాడని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుందని ముంబై మీడియా రెండు మూడు రోజులుగా తెగ ఊదరగొడుతోంది. ముందుగా సుకుమార్ చేతిలో రామ్ చరణ్ 17 అనే పెద్ద బాధ్యత ఉంది…

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం.. చరణ్ మూవీ ఎప్పుడు ?
Sukumar Shah Rukh సాధ్యం అవుతుందా ?
దీనికి ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. తన టీమ్ తో కలిసి తయారు చేసే పనిలో ఉన్నారు. ఎంతలేదన్నా ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది.ప్రీ ప్రొడక్షన్ కు మరో ఏడెనిమిది నెలలు అవసరం పడొచ్చని అంటున్నారట. అంటే మొత్తంగా సెట్స్ పైకి వెళ్ళడానికి అంతా కలిపి ఏడాది పైనే సమయం పడుతుంది. ఈలోగా పెద్ది ఈజీగా అయిపోతుంది కాబట్టి దాని తర్వాత త్రివిక్రమ్ తో రామ్ చరణ్ ఒక సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయానే వార్త బయటకు వచ్చింది.
సో ఎలా చూసుకున్న సుకుమార్ దృష్టి మొత్తం ఆర్సి 17 మీదే ఉంది. ఒకవేళ షారుఖ్ ఖాన్ ఆసక్తి చూపించినా ఇంకో రెండేళ్ల తర్వాత సాధ్యం కావొచ్చు. ఎందుకంటే అతను కూడా భారీ బడ్జెట్ మూవీ కింగ్ మీద బోలెడు డబ్బు, సమయం పెట్టుబడిగా పెడుతున్నారు.