Pv Sindhu : చీర‌క‌ట్టులో స్టైలిష్ స్టెప్పులేస్తూ నెటిజ‌న్స్‌కి థ్రిల్ క‌లిగించిన పీవీ సింధు

Authored By Sam C | The Telugu News | Published on: October 11, 2022, 11:00 am

Pv Sindhu: భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు కోర్ట్‌లో అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌త్య‌ర్ధుల‌ని వ‌ణికిస్తున్న సింధు సోష‌ల్ మీడియాలో కూడా వినోదం పంచుతూ ఉంటుంది. క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేయ‌డ‌మే కాక‌, ఆస‌క్తిక‌ర వీడియోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. సింధు ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు సంద‌డి చేస్తుంటుంది. తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో నెట్ లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సింధుకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంత‌క‌ముందు కూడా ఈ అమ్మ‌డు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ ప‌లు వీడియోలు షేర్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల‌లోని సాంగ్స్‌కి డ్యాన్స్‌లు చేస్తూ వినోదం పంచింది. గత వారం జాతీయ క్రీడల ప్రారంభ వేడుకుల కోసం గుజరాత్ వెళ్లిన సింధు.. గుజరాతీ బట్టలు ధరించి సంప్రదాయ గార్బా డ్యాన్స్ చేసింది. ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కైవసం చేసుకున్న సింధు చిన్న గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి వైదొలిగింది. తొందర్లోనే తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులోకి రావాలని చూస్తోంది. డిసెంబర్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో పాల్గొనేందుకు సింధు సిద్ధం అవుతుండ‌గా, అభిమానులు త‌ప్ప‌క గెల‌వాల‌ని కోరుతున్నారు.

pv sindhu stylish dance video viral

pv sindhu stylish dance video viral

Pv Sindhu : అద‌ర‌గొట్టింది..

ఇక ఇటీవ‌ల‌ తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా… ‘చాలా మంది హీరోలు ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. మేము మంచి స్నేహితులం కూడా’ అని తెలుగు తేజం పీవీ సింధు చెప్పారు. సింధు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని హోస్ట్ అడగ్గా.. ‘ఏమో నా బయోపిక్ ఉండొచ్చేమో. అందులో నేనే హీరోయిన్‌గా చేస్తానేమో’ అని నవ్వుతూ బదులిచ్చారు. లవ్ లెటర్స్ గురించి అడగ్గా.. తనకు ఇప్పటివరకు ఎన్నో ప్రేమ లేఖలు వచ్చాయని, అందులో ఓ 70 ఏళ్ల వ్యక్తి రాసిన లెటర్ కూడా ఉందని సింధు చెప్పారు. తనను పెళ్లి చేసుకోకపోతే కిడ్నాప్‌ చేస్తానని కూడా రాశాడని చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp