PV Sindhu : ఒలంపిక్స్‌లో పీవీ సింధు జోరు.. రెండో రౌండ్‌లోను విజయం సాధించిన తెలుగు తేజం
PV Sindhu : పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్స్‌లో ఇండియన్స్ అదరగొడుతున్నారు.ఇప్పటికే ఇండియా రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. అయితే పీవీ సింధు గోల్డ్ మెడల్ దక్కించుకోవడం ఖాయం అని అందరు చెప్పుకొస్తున్నారు. సింధు ప్రత్యర్థులకు బలమైన సందేశం పంపుతూ తొలి మ్యాచ్ పూర్తి అధిపత్యంతో విజయాన్ని అందుకుంది. జూలై 28న జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్‌లో సింధు తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాహా అబ్దుల్ రజాక్‌ను సులభంగా ఓడించింది. ప్రపంచ నంబర్-111 ప్లేయర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-9, 21-6 తేడాతో విజయం సాధించింది.
సింధు జోరు..
ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు సింధు కేవలం 29 నిమిషాలు పట్టింది. ఇప్పుడు సింధు జూలై 31న తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కుబాతో తలపడింది. ఈ మ్యాచ్‌లోను గెలిచి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 21-5,21-10 పాయింట్లతో పీవీ సింధు అదిరిపోయే విజయాన్ని అందుకుంది. కేవలం 34 నిమిషాలలో ఈ గేమ్ ముగిసింది. ముందు ఎస్టోనియా పోరాట పటిమ ప్రదర్శించిన సింధు మొక్కవోని దీక్షతో గేమ్ ఆడి సత్తా చాటింది.ఈ క్రమంలో గ్రూప్ ఎం నుండి సింధు ప్రీ క్వార్టర్స్‌లో రౌండ్ 16కి దూసుకెళ్లింది.
సింధు హ్యాట్రిక్ ఒలింపిక్స్ మెడల్స్ సాధించడం ఖాయమని ఆమె తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. ఆయన తన కూతురు తప్పక ఫైనల్‌కు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా సింధు తనపై ఉన్న అంచనాలను అందులేకపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో గాయపడిన సింధు పునరాగమనం తర్వాత గత ఫామ్‌ను అందిపుచ్చుకోలేక పోయింది. ఒలింపిక్స్‌లో ఫామ్ కంటే ఆ రోజు మెరుగైన ప్రదర్శనే చాలా కీలకమని, దేశం గర్వించేలా తన కూతురు పోరాడుతుందని పీవీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. పారిస్ విశ్వక్రీడల్లో సింధు పతకం సాధిస్తే.. ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కుతోంది.