Rajamouli : పొరపాటున కూడా ఈ స్టార్ హీరోస్ తో రాజమౌళి సినిమా లు చేయడు, కారణం ఇదే !

Advertisement

Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు రాజమౌళి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. ఇక రామ్ చరణ్ మగధీర సినిమాతో జక్కన్న స్థాయి మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలకు, గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కే సినిమాలకు రాజమౌళి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. రాజమౌళి సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎదో తెలియని ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ రాజమౌళి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో ఎక్కువగా సినిమాలు చేశాడు.

Rajamouli do not make films with mega heroes
Rajamouli do not make films with mega heroes

అలాగే రవితేజ, సునీల్,నాని లాంటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా తీయబోతున్నాడు. అయితే మెగా హీరోలతో మాత్రం జక్కన్న ఇంతవరకు సినిమా చేయలేదు. వీళ్లు స్టార్ హీరోలు అయినప్పటికీ జక్కన్న వీళ్లతో ఒక్క సినిమా కూడా తీయలేదు. జక్కన్న మెగా హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఎంటా అని జనాలు చర్చించుకుంటున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో రాజమౌళి పని చేయలేదు. చిరంజీవి రాజమౌళి డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపినా రాజమౌళి మాత్రం రిస్క్ తీసుకోవాలని భావించడం లేదు.

Advertisement
Rajamouli do not make films with mega heroes
Rajamouli do not make films with mega heroes

చిరంజీవి వయస్సు ఎక్కువ కావడంతో రిస్క్ షాట్స్ తీయడం కష్టమని అదే సమయంలో సీనియర్ హీరోలతో తనకు నచ్చినట్టు వర్క్ చేయించుకోవడం సులువు కాదని జక్కన్న భావిస్తున్నట్లు జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ కారణాల వల్లనే రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి సినిమా తెరకెక్కలేదు. పవన్ కళ్యాణ్ తో రాజమౌళి విక్రమార్కుడు సినిమా తీయాలని చూసిన కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయలేదు. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో రాజమౌళి ఈ హీరోతో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. రాబోయే రోజుల్లో కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే ఛాన్స్ లేదు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో కూడా జక్కన్న సినిమా తీయలేదు.

Advertisement
Advertisement