Rajamouli : శ్రీదేవితో గొడవ పడ్డ రాజమౌళి .. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి ..!!
Rajamouli : సినిమా పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది అతిలోక సుందరి శ్రీదేవి. కేవలం శ్రీదేవి అందం చూడటానికి చాలామంది థియేటర్స్ కు వెళ్లేవారు. తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆమె నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ సినిమాలో ఆమె ఎంత అందంగా ఉంటుందో మాటల్లో చెప్పలే. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత బోనీ కపూర్ ని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.
ఆ తర్వాత 55 సంవత్సరాల వయసులో దుబాయ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో శివగామి దేవి పాత్రకు ముందుగా శ్రీదేవిని తీసుకున్నారు. ఆమెకు కథ చెప్పి శ్రీదేవిని ఒప్పించాడు రాజమౌళి. అయితే అనుకోకుండా ఆ ప్లేస్ లో రమ్యకృష్ణ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక రమ్యకృష్ణ పాత్రకు మంచి పేరు వచ్చాక ఈ విషయాన్ని బయట పెట్టాడు రాజమౌళి. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా అదృష్ట కొద్ది ఆ పాత్రకు శ్రీదేవి గారు ఒప్పుకోలేదని నవ్వుకుంటూ మాట్లాడారు. శ్రీదేవి ఈ సినిమాలో నటించేందుకు
ఏడు కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందట. అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చార్జ్డ్ ఫ్లైట్ టికెట్లు, తనతో పాటు తన అసిస్టెంట్లకు 5 స్టార్ హోటల్ బుక్ చేయాలని ఇలా రకరకాల కండిషన్లు పెట్టారని, తమకు బడ్జెట్ పరంగా వర్కౌట్ కాదని ఆమె ప్లేసులో రమ్యకృష్ణ తీసుకున్నారని చెప్పారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శ్రీదేవి.. రాజమౌళి బాహుబలి సినిమా బాగా చేశారని, ఆయన డైరెక్ట్ చేసిన ఈగ సినిమా ఎంతో నచ్చిందని, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన అతను నేను అన్న మాటలు అలా చెప్పాడం బాధేసింది అని చెప్పింది.