Vijayendra prasad
Vijayendra prasad : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలకి అభిమానులు లెక్కకు మించి ఉన్నారు. ఆయన తీసే ప్రతీ సినిమాకి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారనే విషయం తెలిసిందే. కొడుకు సినిమాలకి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ లాంటి వాళ్ళకి పాన్ ఇండియన్ స్థాయిలో కథ కూడా అందించి తన సత్తా ఏంటో చూపించారు. కొడుకు రాజమౌళి తో పాటు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా పాన్ ఇండియన్ రైటర్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో విచ్చేసిన విజయేంద్ర ప్రసాద్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని ఈ సినిమాకి ఆమె వెన్నుముక అని తెలిపిన ఆయన ఎన్.టి.ఆర్, చరణ్ మధ్య ఓ అద్భుతమైన యాక్షన్ సీన్ ఉంటుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని సినిమా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే తల్లికి ఎంత బాధ కలుగుతుందో చరణ్, తారక్ మధ్య ఫైట్ వచ్చినప్పుడు అభిమానులు అదే ఫీలవుతారని వెల్లడించారు.
Vijayendra prasad
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ది లవ్ మ్యారేజ్ అని తెలిపారు. అయితే ఆయన పెళ్ళి చేసుకున్న ఆవిడ కాస్ట్ గురించి ఏరోజు తనతో ప్రస్తావించలేదని చెప్పారు. అయితే ఓ సందర్భంలో చిరంజీవికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ..ఆయన భార్య ..మా చిరంజీవి అని సంబోధించారట. మా చిరంజీవి ఏంటీ అన్నప్పుడు మా కాపులే కదా చిరంజీవి అంటూ తను కాపులనే విషయాన్ని చెప్పకనే చెప్పారట. ఈ రకంగా చిరంజీవి పరోక్షంగా రాజమౌళి తల్లి కాస్ట్ బయట పడటానికి కారణం అయ్యారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన ఈ ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.