ఆనందయ్య మందు కంట్లోనే ఎందుకు వేస్తున్నాడు… ఆయుష్ సీఎంవో కామేశ్వరావు చెప్పిన షాకింగ్ నిజాలు..!
Anandaiah Medicine నెల్లురూ జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య Anandaiah Medicine కరోనా మందు వల్ల ఎంతో పాపులర్ అయ్యాడో మనకు తెలిసిందే. ఆనందయ్య మందును కంట్లోనే ఎందుకు వేసుకోవాలి, కంట్లో వేయడం వల్ల ఏం జరుగుతుంది. ఆ మందు వేసుకున్న కోటయ్య ఎందుకు మృతి చెందాడు. కరోనా వల్ల లక్షలాది మంది ప్రాణాలు పోతున్నా.. ఆనందయ్య మందు తీసుకున్న వారికి కరోనా ఎలా తగ్గింది.. అనే విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే ఆ మందు వెనుక రహష్యాన్నితెలుసుకున్న ఆయుష్, ఆయుర్వేద నిపుణులు సైతం ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందుకు ఉపయోగిస్తున్న మూలికల వల్ల ఏ హాని ఉండదని నిర్థారించారు. ప్రభుత్వం మందు పంపిణీకి అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఆనందయ్య మందును అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టాడు. కంట్లో వేసిది తప్ప మిగతా మందులు ప్రజలకు పంపిణీ చేయవచ్చు అని ప్రభుత్వం షరతులు విధించింది.
అయితే కరోనా వచ్చి ఆక్సిజన్ లేవల్స్ , లేవలేని పరిస్థితిలో ఉన్నవారు ఆనందయ్య మందు కంట్లో వేయగానే వెంటనే లేచి కూర్చుంటున్నారు… దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి.. గతంలో దీన్ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఈ మందు సురక్షితమా… అనే విషయాలపై ఢిల్లీ ఎంసీడీ ఆయుష్ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్, మరియు ఆయుర్వేద నిపుణులు డాక్డర్ కామేశ్వరరావు ఆనందయ్య మందుపై కొన్ని ఆస్తకర విషయాలు వివరించడం జరింగింది.
ఆనందయ్య Anandaiah Medicine మందు మంచిదేనా.. మందును పరిశీలించేందుకు వెళ్లినవారు ఆయుర్వేద పుస్తకాల్లో ఆ ఫార్ములా పై అన్వేషించడం జరిగింది. ఆనందయ్య ఏ కాంబినేషన్ మందును కరోనా రోగులకు ఇస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ మందులో వాడే ములికలు, ముడి పదార్దాలు అన్నీ కూడా శరీరానికి పనికి వచ్చేవే. అందుకే ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆనందయ్య దానిని ఆయుర్వేద మందుగా చెబుతున్నాడు కాబట్టి ఆయన దాని కోసం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా అది ఏ రకమైన మందో ఆయన తెలపాలి. అయితే ఇదంతా జరగడానికి చాలా ఆలస్యం అవుతుంది అని, అలాగే ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో జాప్యం చేయకుండా వెంటనే మందు పంపిణీకి అనుమతి ఇచ్చారు. ఆనందయ్య మందు లోకల్ ఔషధమని, ఎవరైనా ఇష్టం ఉన్నవారు మందుకు తీసుకోవచ్చని తెలిపారు. అయితే దీనిని ఆయుర్వేద మందులా తయారు చేయడానికి వీలుపడడం లేదు.
పాము కాటుకు మందు వేసే వైద్యుల్లో వంశపారంపర్యంగా ఉండే వారిలో ఆనందయ్య కూడా ఉన్నాడు. సాధారణంగా పాము కాటుకు పసరు వైద్యం చేస్తారు. ఆనందయ్య Anandaiah Medicine తయారు చేసే కరోనా మందు ఇప్పటికిప్పుడు తయారు చేసింది కాదు. అది ఎప్పటి నుంచో ఉంది. అదే మందును కరోనా రోగులకు ఇవ్వడంతో కరోనా తగ్గుతుంది. ఆనందయ్యకు సిద్ధ వైద్యంపై కూడా మంచి పట్టు ఉంది. పంచ మహాభూతాలను సమానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడోచ్చనే ఫార్ములాతో ఆనందయ్య ఈ ములికలను ఉపయోగించారు.
ఆనందయ్యను ఈ విషయంలో అభినందించాలి
ఆనందయ్య Anandaiah Medicine ను ఒక విషయంలో అభినందించాల్సిందే ఎందుకంటే కంట్లో వేసే మందు కొత్తగా అతను కనుగొన్నాడు. కరోనా వల్ల ఆక్సిజన్ కోల్పోతున్న మనిషి ప్రాణాలు నిలబెట్టేందుకు కంట్లో మందు వేస్తే వెంటనే లేచి కూర్చుంటాడనే ఆలోచన రావడం ఆనందయ్యను ప్రశంసించాల్సిన విషయమే. ఈ ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది అంటే.. పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ లెవల్స్ అందక మరణిస్తారు. కాబట్టి ఆయనకు ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు. కంట్లో వేసే పదార్ధాలు, మూలికలు సురక్షితమని ఆయనకు తెలుసు.
ఆ మందు కంట్లోనే ఎందుకు వేయాలి….
కంట్లో మందు వేయడాన్ని అలోపతి నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. కానీ మన శరీరంలో ఫాస్టెస్ అబ్జర్వేటివ్ రూట్ కంజుంక్టివా (కంటి పొర) అక్కడ మందు వేస్తే అది వెంటనే మెదడుకు చేరుతుంది కాబట్టి ఆ మందును కంట్లోనే వేస్తారు. వెనుకటి కాలంలో మందులు లేనప్పుడు పసర్లు పోసేవాళ్లు. పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ లెవల్స్ అందకపోతే మరణిస్తారు. కాబట్టి చివరి ప్రయత్నంగా పసరు పోసి ప్రాణం నిలబెట్టేవారు. ఈ ఐడియాలజీనే ఆనందయ్య కరోనాకు వాడుతున్నారు. అయితే ఆయుర్వేదంలో కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ నా వ్యక్తిగతంగా చెప్పాలంటే , ఆనందయ్య మందు తయారీ కోసం వాడే విధానాన్ని అభినందించాల్పిందే. ఆయన మందుల్లో వాడే మూలికలు, పదార్ధాలు హానికరం కాదు అని డాక్టర్ కామేశ్వరరావు పేర్కొన్నారు.