జూన్ 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. ఈ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి
anandaiah medicine ఈ నెల 07 నుంచి కృష్ణపట్నం ఆనందయ్య anandaiah medicine మందు పంపిణీ జరగనుంది. మందు పంపిణీకి అధికారిక వైబ్‌సైట్ ద్వారా జరగనుంది. తొలుత కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అధికాలు ఈ వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మందు కావాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే వారికి కొరియార్ రూపంలో ఆ మందును ఇంటికి పంపిస్తారు. ఈ మందు తయారీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ ఆవరణలో జరుగుతుందని ఆనందయ్య తెలిపారు.
ఈ మందు తయారు చేసే ప్రాంగణం లో తాత్కాలిక షెడ్ లు నిర్మించి, దానికి భూమి పూజ కూడా చేశారు. ఈ షెడ్ రెండు రోజుల్లో పూర్తి అవుతుందని ఆనందయ్య పేర్కొన్నారు.మరో వైపు ఆన్‌లైన్‌లో మందు పంపిణీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మందు పంపిణీకి బ్లూడార్ట్ కొరియర్ సంస్థ 50 శాతం రాయితీతో పాటు సర్వీస్ ఇస్తామని చెప్పింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒకే చోట కాకుండా మూడు లేదా నాలుగు కేంద్రాలు ఏర్పటు చేసి మందు పంపిణీ చేయాలనే అంశంపై ఆనందయ్య anandaiah medicine గారు పరిశీలిస్తున్నారు. కంట్లో వేసే మందు తప్ప మిగతావి పంపిణీ చేసుకోవచ్చను ఏపీ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.